News December 23, 2025
KNR: ఉచిత శిక్షణకు దరఖాస్తు గడువు పొడిగింపు

విదేశీ విద్యను అభ్యసించే విద్యార్థుల కోసం బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఇచ్చే ఉచిత ‘ఐఎల్టీఎస్’ (IELTS) శిక్షణ దరఖాస్తు గడువును జనవరి 11 వరకు పొడిగించినట్లు వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ఎం. అనిల్ ప్రకాష్ తెలిపారు. అంతర్జాతీయ స్కాలర్‌షిప్‌లు, కమ్యూనికేషన్ స్కిల్స్‌పై అవగాహన కల్పించే ఈ శిక్షణను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సోమవారం ఒక ప్రకటనలో కోరారు.
Similar News
News January 12, 2026
ఎస్పీ కార్యాలయంలో పీజీఆర్‌ఎస్‌కు 16 ఫిర్యాదులు

తూ.గో జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌కు 16 ఆర్జీలు వచ్చాయి. జిల్లా ఎస్పీ డి.నరసింహ కిశోర్ ప్రజల నుంచి స్వయంగా ఆర్జీలు స్వీకరించి, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, ఫిర్యాదులను చట్టపరిధిలో పరిష్కరించి బాధితులకు సత్వర న్యాయం చేయాలని ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారమే ప్రథమ ప్రాధాన్యమని ఈ సందర్భంగా ఎస్పీ స్పష్టం చేశారు.
News January 12, 2026
చంద్రబాబు అప్పులు చేస్తే రాష్ట్రం సింగపూర్ అవుతుందా: రాంబాబు

AP: జగన్ హయాంలో ఐదేళ్లలో రాష్ట్రంలో ₹3.32L కోట్ల అప్పులు చేస్తే చంద్రబాబు ఏడాదిన్నరలోనే ₹3.02L కోట్లు అప్పు చేశారని అంబటి రాంబాబు విమర్శించారు. ‘వైసీపీ అప్పులు చేస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుంది అన్నారు. చంద్రబాబు అప్పులు చేస్తే సింగపూర్ అవుతుందా? జగన్ చేసిన అప్పుల్లో 90% CBN ఏడాదిన్నరలోనే చేశారు. ఎన్నికల హామీలు ఇప్పటివరకు పూర్తి స్థాయిలో అమలు చేయలేదు’ అని అంబటి ఫైరయ్యారు.
News January 12, 2026
మేడారం: మహిళలకు ప్రత్యేకంగా మొబైల్ మరుగుదొడ్లు

మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతరను పురస్కరించుకుని అధికారులు మహిళా భక్తుల కోసం మొబైల్ టాయిలెట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. జాతరలో మహిళలు మలమూత్ర విసర్జన కోసం ఇబ్బందులు పడవద్దని, ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన రెండు మొబైల్ టాయిలెట్ బస్సులను మేడారంలో ఏర్పాటు చేశారు. మహిళా భక్తులకు ఇబ్బందులు తప్పనున్నాయి.


