News April 22, 2024
సలేశ్వరం జాతరకు ప్రత్యేక బస్సులు

అచ్చంపేట: సలేశ్వరం జాతర జరిగే మూడు రోజుల్లో ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. అచ్చంపేట, కల్వకుర్తి, వనపర్తి, నాగర్ కర్నూల్, నారాయణపేట, మహబూబ్ నగర్, గద్వాల, దేవరకొండ, మిర్యాలగూడ, నల్లగొండ డిపోల నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులు నడిపేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ జాతర ఐదు రోజుల నుంచి మూడు రోజులకు కుదించారు.
Similar News
News March 28, 2026
పాలమూరు:ALERT.. ఏప్రిల్ వస్తోంది..!

ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా వేసవి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. వాతావరణ శాఖ అంచనా ప్రకారం.. ఏప్రిల్ మొదటి 2 వారాల్లోనే నగరంలో ఉష్ణోగ్రత 38 డిగ్రీలకు చేరే అవకాశం ఉంది. మధ్యాహ్నం బయటకు వెళ్లేటప్పుడు గొడుగు, రుమాలు తీసుకెళ్లాలని, నీరు తాగడం, తేలికపాటి దుస్తులు ధరించడం, అవసరం లేకుండా ఎండలో తిరగకూడదని అధికారులు హెచ్చరించారు. వృద్ధులు, చిన్నపిల్లలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
News March 27, 2026
MBNR: అంబేద్కర్ వర్సిటీ పీజీ పరీక్షల షెడ్యూల్ విడుదల

డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పీజీ మొదటి సంవత్సరం 2025 – 26 పరీక్షల షెడ్యూల్ విడుదల అయినట్లు మహబూబ్ నగర్ ఎంవీఎస్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డా కె పద్మావతి పేర్కొన్నారు. పీజీ మొదటి సెమిస్టర్ పరీక్షలు మేలో ఉంటాయని టైం టేబుల్ వెబ్ సైట్‌లో ఉందని తెలిపారు. పరీక్షకు సంబంధించిన ఫీజు చెల్లింపునకు ఏప్రిల్ 13వ తేదీ వరకు ఆకాశం ఉందని రీజినల్ కోఆర్డినేటర్ డా జి సత్యనారాయణ గౌడ్ వెల్లడించారు.
News March 26, 2026
MBNR: హత్యాయత్నం కేసులో ముగ్గురికి జైలుశిక్ష

భూవివాదం నేపథ్యంలో జరిగిన హత్యాయత్నం కేసులో ముగ్గురు నిందితులకు గౌరవనీయ కోర్టు శిక్ష ఖరారు చేసింది. 2023 జనవరి 31న చన్నారెడ్డిపల్లి గ్రామ పరిధిలో బాధితుడు యెరుకలి చెన్నయ్యపై నిందితులు యెరుకలి వెంకటయ్య A1, శ్రీను A2, మల్లేష్ A3 కలిసి ప్రాణాంతక దాడికి పాల్పడ్డారు. పోలీసులను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. నేరస్తులకు శిక్ష పడేలా కృషి చేసిన నవాబ్‌పేట్ పోలీసుల పనితీరును ఆయన కొనియాడారు.


