News December 23, 2025
రామగుండం పోలీస్ స్టేషన్ సందర్శించిన డీసీపీ

పెద్దపల్లి డీసీపీ బి.రామ్ రెడ్డి రామగుండం పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. రిసెప్షన్ సెంటర్‌లో పిటిషన్ల రికార్డులు, నమోదు కేసుల ప్లాన్ ఆఫ్ యాక్షన్, అండర్ ఇన్వెస్టిగేషన్ కేసుల వివరాలు పరిశీలించారు. సిబ్బంది పనితీరు, ప్రజలతో ప్రవర్తన, మహిళా సిబ్బందిని అన్ని డ్యూటీల్లో పాల్గొనడం, ఎలాంటి సమస్యలు ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం కల్పించాలని ఆదేశించారు.
Similar News
News December 29, 2025
గాజువాక: ఉరి వేసుకుని బాలుడి ఆత్మహత్య

గాజువాక డిపో 59 వార్డు నక్కవానిపాలెంలో ఓ బాలుడు ఉరివేసుకొని మృతి చెందిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. ఇంట్లో ఎవరు లేని సమయంలో యుగంధర్ వర్మ (16) ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గాజువాక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. బాలుడి అత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
News December 29, 2025
చిత్తూరు జిల్లాలో కనపడని మామిడి పూత..!

చిత్తూరు జిల్లాలో మంచు ప్రభావంతో మామిడి తోటల్లో ఇంతవరకు పూత కనబడటం లేదు. ఉమ్మడి జిల్లాలో సుమారు 1.65 లక్షల హెక్టార్లలో మామిడి తోటలు సాగులో ఉన్నాయి. సాధారణంగా నవంబర్, డిసెంబర్ నాటికి తోటల్లో మామిడి పూత వస్తుంది. ఈసారి మంచు అధికంగా ఉండటంతో ఇప్పటివరకు పూత కనిపించ లేదు. రైతులు వేలాది రూపాయలు వ్యయం చేసి మందులు పిచికారీ చేస్తున్నారు.
News December 29, 2025
క్యాబినెట్ సమావేశం ప్రారంభం..

AP: సీఎం CBN అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం ప్రారంభమైంది. మొత్తం 20 అజెండాలపై చర్చించనుంది.
*అమరావతి అభివృద్ధికి నాబార్డు నుంచి రూ.7,387 కోట్ల రుణాలు
*అటవీశాఖలో అసిస్టెంట్ కన్జర్వేటర్ పోస్టుల భర్తీ
*ఉద్యోగుల డీఏ పెంపు అమలుకు ఆర్థికశాఖ అనుమతికి ఆమోదం
*గ్రామ, వార్డు సచివాలయాల పేర్ల మార్పుపై ఆర్డినెన్స్
*జిల్లా కోర్టుల్లో సిస్టమ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ల పోస్టులు


