News April 22, 2024
నెల్లూరు: నేడే పదో తరగతి ఫలితాలు

పదవ తరగతి పరీక్ష ఫలితాలను విజయవాడ వేదికగా సోమవారం విడుదల చేయనున్నట్లు జిల్లా విద్యా శాఖ అధికారి రామారావు ఒక ప్రకటనలో తెలిపారు. నెల్లూరు జిల్లాలో దాదాపు 34 వేల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్ష రాసినట్లు పేర్కొన్నారు. విద్యార్థులు పరీక్ష ఫలితాలను results.bse.ap.gov.in వెబ్ సైట్ లో చూడవచ్చని చెప్పారు.
Similar News
News March 14, 2026
నెల్లూరులో పలు హోటల్స్ తనిఖీ.. 92 సిలిండర్లు సీజ్

జిల్లాలోని పలు హోటళ్లు, దుకాణాలు, బార్ & రెస్టారెంట్లు, గ్యాస్ రీఫిల్లింగ్ యూనిట్ల వద్ద విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇళ్లలో వాడే సిలిండర్లను అక్రమంగా హోటల్స్‌లో వాడుతున్నట్లు గుర్తించారు. భారత్ గ్యాస్ 21 ఖాళీ సిలిండర్లు, ఇండేన్ – 17 ఖాళీ సిలిండర్లు, ఇండేన్ – 03 నిండిన సిలిండర్లు, మొత్తం 92 గ్యాస్ సిలిండర్లు సీజ్ చేశారు.
News March 14, 2026
నెల్లూరు: ఇలాగైతే ప్రమాదాలు నివారించగలమా?

నెల్లూరు జిల్లాలో అగ్నిమాపక సిబ్బంది కొరత వేధిస్తోంది. ప్రతి అగ్నిమాపక కేంద్రంలో 9మంది సిబ్బంది ఉండాల్సి ఉంటుంది. జిల్లా కేంద్రమైన డబల్ యూనిట్లో 18 మందికి 10 మందే పనిచేస్తున్నారు. దీంతో ఈ శాఖ సేవలుపై ప్రభావం పడుతోంది. కొన్నేళ్లుగా ఈ కొరత వేధిస్తుంది. కొన్నిచోట్ల హోంగార్డులతో నెట్టుకొస్తున్నారు. వేసవి వేళ కొరత ఇబ్బందిగా మారుతుంది.