News April 22, 2024
రాష్ట్ర చరిత్రలోనే రికార్డు స్థాయి విద్యుత్ వినియోగం
AP: ఎండల తీవ్రతకు విద్యుత్ వినియోగం రికార్డు స్థాయికి చేరుకుంది. రాష్ట్ర డిస్కంల చరిత్రలోనే గరిష్ఠంగా శుక్రవారం విద్యుత్ డిమాండ్ 13,319 మెగావాట్లు నమోదైంది. గత ఏడాది మార్చి 7న 13,255 మెగావాట్ల డిమాండ్ ఇప్పటి వరకు అత్యధికంగా ఉండేది. కాగా ప్రస్తుతం రోజుకు విద్యుత్ వినియోగం సగటున 242.65 మిలియన్ యూనిట్లుగా ఉంటోంది. గత ఏడాది ఇదే సీజన్‌లో 231.65MUలుగా ఉంది.
Similar News
News November 20, 2024
కులగణన సర్వే 72 శాతం పూర్తి
TG: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే ఇప్పటివరకూ 72% పూర్తయింది. నిన్నటి వరకు 83,64,331 ఇళ్లలో సర్వే చేసినట్లు అధికారులు వెల్లడించారు. అత్యధికంగా ములుగులో 98.9% ఇళ్లలో సర్వే పూర్తయింది. ఆ తర్వాతి రెండు స్థానాల్లో నల్గొండ (95%), జనగామ (93.3%) ఉన్నాయి. హైదరాబాద్‌లో అత్యల్పంగా 50.3% ఇళ్లలో కులగణన జరిగింది.
News November 20, 2024
భాస్కర –II ఉపగ్రహం విశేషాలు
1981లో సరిగ్గా ఇదే రోజు రష్యాలోని వోల్గోగ్రాడ్ ప్రయోగ వేదిక నుంచి భాస్కర –II ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగించింది. 444KGS బరువు ఉండే ఈ శాటిలైట్ పని చేసే కాలం ఒక సంవత్సరం కాగా, ఇది పదేళ్లు కక్ష్యలో తిరిగింది. భూ పరిశీలన కోసం ప్రయోగించిన భాస్కర శ్రేణిలో ఇది రెండవ ఉపగ్రహం. గణిత శాస్త్రవేత్త మొదటి భాస్కరుడు గుర్తుగా దీనికి ఆ పేరు పెట్టారు. దీనికి ముందు 1979లో భాస్కర-I ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగించింది.
News November 20, 2024
నేడు వేములవాడకు సీఎం రేవంత్
TG: సీఎం రేవంత్ ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడకు వెళ్లనున్నారు. ఉ.10:10 నుంచి ఉ.11.45 గంటల మధ్యలో వేములవాడ రాజన్నను దర్శించుకుంటారు. అనంతరం ఆలయ అభివృద్ధి పనులు, మిడ్ మానేరు నిర్వాసితుల కోసం నిర్మించనున్న ఇందిరమ్మ ఇళ్లతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. మ.1.45 తర్వాత HYDకు తిరుగు ప్రయాణమవుతారు.