News December 23, 2025
కడప: ‘విద్యుత్ సమస్యలకు సత్వర పరిష్కారం’

నిరంతరాయంగా ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. సోమవారం తన ఛాంబర్‌లో కరంటోళ్ల జనబాట”కు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. విద్యుత్ సమస్యలపై ప్రజలకు వెంటనే పరిష్కారం అందించేందుకు విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన “కరంటోళ్ల జనబాట” అనే వినూత్న కార్యక్రమం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.
Similar News
News December 26, 2025
రేపు రూ.97 కోట్లతో ప్రొద్దుటూరు మున్సిపాలిటీ బడ్జెట్

2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.97 కోట్ల అంచనాతో ప్రొద్దుటూరు మున్సిపాలిటీ బడ్జెట్ రూపొందించారు. ఆరంభనిల్వ రూ.7.37 కోట్లుగా చూపారు. జమలు రూ.90.89 కోట్లు, ఖర్చు రూ.97.04 కోట్లుగా బడ్జెట్ రూపొందించారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి జమలు రూ.66.50 కోట్లు, ఖర్చులు రూ.63.55 కోట్లుగా చూపారు. నిల్వ రూ.7.37 కోట్లుగా చూపారు. శనివారం బడ్జెట్ సమావేశం ఏర్పాటు చేసినట్లు చైర్ పర్సన్ లక్ష్మీదేవి తెలిపారు.
News December 25, 2025
మైదుకూరులో గుండెపోటుతో యువ వైద్యుడు మృతి

మైదుకూరు పట్టణం బద్వేల్ రోడ్డుకు చెందిన యువ వైద్యుడు శశికాంత్ గురువారం గుండెపోటుతో మృతి చెందాడు. ఈయన మృతి చెందడం పట్ల మైదుకూరు పట్టణ వాసులు, పరిసర ప్రజలు విచారం వ్యక్తం చేశారు. కాగా ఈయన తండ్రి డాక్టర్ రంగ సింహ ఇటీవలే వయో భారం కారణంగా మృతి చెందాడు. ఒకే కుటుంబంలో ఇద్దరు వైద్యులు మృతి చెందడంతో పట్టణవాసులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఈయన ఉన్నత వైద్య విద్యను అభ్యసించారు.
News December 25, 2025
క్యాలెండర్‌ను ఆవిష్కరించిన వైఎస్ జగన్

మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ క్రిస్మస్ సందర్భంగా పులివెందులలోని సీఎస్‌ఐ చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా 2026 నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. అనంతరం క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో ఏసుప్రభువును ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ విజయమ్మ, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


