News December 23, 2025

ఉట్నూర్: 7 ఏళ్లకు లభించిన భూమి పట్టా

image

ఉట్నూర్ మండలం తాండ్ర గ్రామానికి చెందిన మండే మల్లారి, సండే సారూబాయ్‌లకు 7 సంవత్సరాలకు భూమి పట్టా లభించిందని ITDA PO యువరాజ్ మర్మాట్ తెలిపారు. సోమవారం పట్టాలను వారికి అందజేశారు. తాండ్ర గ్రామ శివారులో గల 49/23/1/2 సర్వే నంబర్‌లో 5.03 ఎకరాలు, 49/23/3 సర్వే నంబర్‌లో 5.03 ఎకరాల భూమి విస్తీర్ణానికి పట్టా చేసి లబ్ధిదారులకు మంజూరు చేశామన్నారు.

Similar News

News January 6, 2026

ఓటర్ల జాబితా రూపకల్పనలో పారదర్శకత పాటించాలి: కలెక్టర్

image

రాబోయే మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని కలెక్టర్ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆదిలాబాద్ కలెక్టరేట్లో మున్సిపల్ ఎన్నికలు, ఓటర్ల జాబితా సవరణ, అభ్యంతరాల పరిష్కారంపై రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో ఓటర్ల జాబితా కీలక పాత్ర పోషిస్తుందన్నారు.

News January 6, 2026

నాగోబా జాతరకు రాష్ట్ర మంత్రులకు ఆహ్వానం

image

ఇంద్రవెల్లిలోని కేస్లాపూర్ నాగోబా జాతర ఈనెల 18న ప్రారంభం కానుంది. ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, కేస్లాపూర్ నాగోబా దేవాలయ కమిటీ సభ్యులతో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు తోపాటు సీఎం సలహాదారుడు నరేందర్ రెడ్డిలను హైదరాబాద్‌లో కలిశారు. ఈనెల 18న నాగోబా మహా పూజ, 22న దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. నాగోబా జాతరకు హాజరు కావాలని ఆహ్వాన పత్రం అందించారు.

News January 6, 2026

ADB: మెడికల్ ఆఫీసర్ ఉద్యోగానికి నోటిఫికేషన్

image

వైద్య ఆరోగ్యశాఖ NHM పరిధిలో మెడికల్ ఆఫీసర్ ఉద్యోగానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఆదిలాబాద్ డీఎంహెచ్ఓ డా.నరేందర్ రాథోడ్ తెలిపారు. పూర్తి వివరాలను కార్యాలయ నోటీస్ బోర్డ్ తోపాటు http://adilabad.telangana.gov.in వెబ్‌సైట్‌లో ఉంచినట్లు వెల్లడించారు. ఈనెల 9 తేదీలోపు దరఖాస్తులను అభ్యర్థులు సమర్పించాలని సూచించారు.