News December 23, 2025

నేడు కొవ్వూరులో ఆగనున్న 2 ఎక్స్‌ప్రెస్ రైళ్లు

image

ఈనెల 23వ తేదీ నుంచి కొవ్వూరు రైల్వే స్టేషన్‌లో విశాఖపట్నం-మచిలీపట్నం, విశాఖపట్నం కడప వెళ్ళే తిరుమల ఎక్స్‌ప్రెస్ ఆగనున్నాయి. ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు ఎంపీ దగ్గుపాటి పురందరేశ్వరి కొవ్వూరు రైల్వేస్టేషన్‌లో జెండా ఊపి రైళ్ళను ప్రారంభిస్తారని జిల్లా బీజేపీ అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర తెలిపారు.

Similar News

News January 15, 2026

తూ.గో: యాంకర్ శ్యామల సంచలన వ్యాఖ్యలు

image

భక్తుడికి అన్యాయం జరుగుతుంటే దేవుడు చూస్తే ఉరుకోడని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్.శ్యామల పేర్కొన్నారు. ఫ్లెక్సీ ఘటనలో అరెస్టై, విడుదలైన వైసీపీ కార్యకర్తలను తూర్పు చోడవరంలో బుధవారం ఆమె పరామర్శించారు. వైసీపీ అధినేత జగన్‌ను ఉద్దేశించి భక్తులకు అన్యాయం జరిగిందంటే దేవుడు ఊరుకోడని, తప్పకుండా స్పందిస్తారని ఆమె వెల్లడించారు. కార్యకర్తలకు భరోసా ఇచ్చి ధైర్యం చెప్పారు.

News January 15, 2026

కొవ్వూరు: కోడిపందేల్లో గెలిస్తే మోటార్ సైకిళ్లు గిఫ్ట్

image

కొవ్వూరు మండలం ఐపంగిడిలో బుధవారం కోడిపందేల నిర్వాహకులు బంపర్ ఆఫర్లు ప్రకటించారు. పందేల్లో గెలిచిన పుంజుల యజమానులకు మోటార్ సైకిళ్లు బహుమతిగా ఇస్తామని ప్రకటించి, బరుల వద్ద వాటిని ప్రదర్శనకు ఉంచారు. ఒక శిబిరంలో ఆరు పుంజుల పోటీలో నెగ్గిన వారికి, మరోచోట ఇద్దరు విజేతలకు బైక్‌లు అందజేస్తామన్నారు. పందెం రాయుళ్లను ఆకర్షించేందుకు నిర్వాహకులు ఇలాంటి భారీ ఆఫర్లు ప్రకటించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.