News April 22, 2024
కర్నూలు: ఈ నియోజకవర్గంలో మెుదటి ఎమ్మెల్యే.. స్వతంత్ర అభ్యర్థి

ఆదోని నియోజకవర్గంలో 15 సార్లు ఎన్నికలు జరగగా అందులో రెండుసార్లు ఇండిపెండెంట్ అభ్యర్థులే గెలిచారు. 1952లో మెుదటిసారి జరిగిన ఎన్నికల్లో పదిమంది అభ్యర్థులు పోటీ పడ్డారు. స్వతంత్ర అభ్యర్థి హెచ్.రామలింగారెడ్డి.. తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి టి.మల్లయ్యపై 5561 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆ తర్వాత 1962లో సీతారామరెడ్డి(ఇండిపెండెంట్).. తిమ్మారెడ్డి(కాంగ్రెస్)పై 4770 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
Similar News
News March 5, 2026
ఎంపీ నిధుల వినియోగంపై బస్తిపాటి సమీక్ష

ఎంపీ నిధుల వినియోగం, అభివృద్ధి పనుల పురోగతిపై ఎంపీ బస్తిపాటి నాగరాజు జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎంపీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, ఏపీఈడబ్ల్యూఐడీసీ శాఖల అధికారులు పాల్గొన్నారు. 2024-26 ఆర్థిక సంవత్సరాల పనులపై చర్చించిన ఎంపీ, నిధుల ఖర్చులో అలసత్వం వహించవద్దని ఆదేశించారు. పనులు వేగవంతం చేసి ప్రజలకు సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు.
News March 4, 2026
కర్నూలు: కూతురిని మోసం చేసిన తల్లికి రిమాండ్

కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి నర్సింగ్ కాలేజీ హెడ్ కుక్ డి.రమణమ్మను చెక్ బౌన్స్, చీటింగ్ కేసులో త్రీటౌన్ పోలీసులు అరెస్టు చేశారు. తన సొంత కూతురు ప్రదీపకు రూ.8 లక్షలు ఇవ్వాల్సి ఉండగా రమణమ్మ చెల్లని చెక్కులు ఇచ్చి మోసం చేసింది. దీనిపై బాధితురాలు కోర్టును ఆశ్రయించగా, న్యాయమూర్తి అనూష నిందితురాలికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ బుధవారం తీర్పునిచ్చారు.
News March 4, 2026
కర్నూలు: ఎండల ఎఫెక్ట్.. వడదెబ్బతో సర్పంచ్ భర్త మృతి

ఎండలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మంగళవారం కర్నూలులో 39 డిగ్రీలు, నంద్యాలలో 37 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం నుంచి ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. కాగా, నంద్యాల(D) జూపాడు బంగ్లా(M) తాటిపాడు సర్పంచ్ వంగల లక్ష్మీదేవి భర్త కృష్ణారెడ్డి(62) వడదెబ్బతో మృతిచెందారు.


