News April 22, 2024
ముద్దనూరు: ప్రమాదంలో డ్రైవర్ మృతి

కడప జిల్లాలో ప్రమాదవశాత్తు షేక్షావలి (38) అనే డ్రైవర్ మృతి చెందాడు. సీఐ దస్తగిరి సమాచారం మేరకు.. ముద్దనూరుకు చెందిన షేక్షావలి లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. లారీ మరమ్మతులు చేసుకుంటుండగా ఆదివారం లారీపై నుంచి జారి పడ్డాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతడిని ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అక్కడే మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేశారు.
Similar News
News April 1, 2026
కడప: కోటాను మించి విద్యుత్ వినియోగం.!

కడప విద్యుత్ సర్కిల్ (SE) పరిధిలో మార్చి నెలలో విద్యుత్ వినియోగం పెరిగింది. మార్చి నెలకు 427.112 MU కోటా కాగా.. మార్చి 30 వరకు 484.178MU వినియోగం జరిగింది. డివిజన్ వారీగా విద్యుత్ కోటా, వినియోగం వివరాలు ఇలా ఉన్నాయి.
➤ కడప-43.410-70.587 MU
➤ పులివెందుల-72.270-82.467 MU
➤ ప్రొద్దుటూరు-136.890-117.650 MU
➤ మైదుకూరు-59.169-82.462 MU
➤ రాజంపేట-62.576-75.763 MU
➤ రాయచోటి-52.806-55.249 MU.
News April 1, 2026
ఒంటిమిట్ట: కళ్యాణ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామివారి శ్రీ రామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు టీటీడీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్న సీతారాముల కళ్యాణ మహోత్సవానికి అత్యంత వైభవంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. కళ్యాణ మహోత్సవ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి, టీటీడీ జేఈవో వీ.వీరబ్రహ్మం మంగళవారం పరిశీలించారు. భక్తులకు అందిస్తున్న ఆహార పదార్థాలను పరిశీలించి అధికారులతో చర్చించారు.
News April 1, 2026
ఒంటిమిట్ట: కళ్యాణాన్ని వీక్షించే భక్తులకు ఆహార పదార్థాలు

ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణం రేపు సాయంత్రం 6-30 గంటల నుంచి 8-30 గంటలకు వరకు జరుగనుంది. కళ్యాణాన్ని వీక్షించేందుకు గ్యాలరీలలో వేచి ఉండే భక్తులకు కోసం టీటీడీ సాయంత్రం నుంచి పులిహోర, రవ్వ కేసరి, మైసూర్ పాక్, బిస్కెట్ ప్యాకెట్, కారాసు, అరటిపండు, వాటర్ బాటిల్, మజ్జిగ ప్యాకెట్ ఇవ్వనున్నారు.


