News December 23, 2025

పర్యాటక అద్భుతాలు పరిచయం చేస్తే బహుమతులు: ASF కలెక్టర్

image

కొమురం భీమ్ జిల్లాలో దాగి ఉన్న పర్యాటక అందాలను ఫొటోలు, వీడియోల రూపంలో పరిచయం చేసిన వారికి పర్యాటకశాఖ ఆధ్వర్యంలో భారీ నగదు బహుమతి అందజేస్తామని కలెక్టర్ వెంకటేష్ ధోత్రే తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో పర్యాటక శాఖ అధికారి అష్ఫాక్ అహ్మద్‌తో కలిసి ‘100 వీకెండ్ వండర్స్’ గోడ ప్రతులను ఆవిష్కరించారు.

Similar News

News December 27, 2025

‘మేక్ ఇన్ ఇండియా’తో ఎలక్ట్రానిక్స్ రంగం పరుగులు: కేంద్రమంత్రి

image

ఎలక్ట్రానిక్స్ మానుఫ్యాక్చరింగ్‌ రంగం ‘మేక్ ఇన్ ఇండియా’తో పరుగులు పెడుతోందని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ‘2014-15మధ్య 2 మొబైల్ తయారీ యూనిట్స్ ఉంటే ఇప్పుడు 300కు పెరిగాయి. రూ.18వేల కోట్లుగా ఉండే మొబైల్ ఫోన్స్ ఉత్పత్తి రూ.5.5లక్షల కోట్లకు పెరిగింది. ఎలక్ట్రానిక్ గూడ్స్ ఉత్పత్తి రూ.1.9 లక్షల కోట్ల నుంచి రూ.11.3 లక్షల కోట్లకు, వాటి ఎగుమతి రూ.3.3లక్షల కోట్లకు పెరిగింది’ అని <>ట్వీట్<<>> చేశారు.

News December 27, 2025

WGL: టికెట్ ఇవ్వండి సారూ..?

image

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటమి చెందిన సర్పంచ్ అభ్యర్థులు ఇప్పుడు ‘మరో ఛాన్స్ ప్లీజ్’ అంటూ పార్టీ నేతల చుట్టూ తిరుగుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 778 ఎంపీటీసీ, 75 జడ్పీటీసీ స్థానాలకు త్వరలో ఎన్నికలు జరగనుండటంతో కాంగ్రెస్, BRS, BJP నుంచి టికెట్లు సాధించేందుకు ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సానుభూతి తమకు కలిసి వస్తుందనే నమ్మకంతో వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు.

News December 27, 2025

అల్లూరి జిల్లాలో 1,27,907మందికి పింఛన్లు

image

అల్లూరి జిల్లాలో పింఛన్లు కోసం 1,21,907మందికి రూ. 51,37,79,000 ప్రభుత్వం విడుదల చేసిందని జిల్లా అధికారులు శుక్రవారం తెలిపారు. అత్యధికంగా చింతపల్లిగూడెం మండలానికి 9154మందికి, అత్యల్పంగా మారేడుమిల్లిలో 1905 మందికి మంజూరు అయ్యాయని తెలిపారు. డిసెంబర్ 31నే ఇళ్ల వద్ద పింఛన్లు అందజేయడం జరుగతుందని తెలిపారు. ఆరోజు తీసుకోని వారికి జనవరి 2న సిబ్బంది ఇస్తారని, అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు.