News December 23, 2025

పాలమూరు: గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

జిల్లాలోని సాంఘిక, గిరిజన, బీసీ, సాధారణ సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 2026-27 విద్యాసంవత్సరం 5వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా సమన్వయకర్త బి.నాగమణి మాల తెలిపారు. జనవరి 21 వరకు ఆన్‌లైన్‌లో రూ.100 ఫీజుతో దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 22న ప్రవేశ పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. అలాగే 6 నుంచి 9వ తరగతుల్లో ఖాళీల భర్తీకి కూడా దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు వెల్లడించారు.

Similar News

News December 29, 2025

వైకుంఠ ద్వార దర్శనం.. గదుల కేటాయింపు ప్రారంభం

image

AP: తిరుమల వైకుంఠ ద్వార దర్శన భక్తులకు గదుల కేటాయింపు ప్రారంభమైంది. ఎలక్ట్రానిక్ డిప్‌లో టోకెన్లు పొందిన వారికి సీఆర్వో విచారణ కేంద్రంలో గదులు కేటాయిస్తున్నారు. అటు ఇవాళ సర్వదర్శన టోకెన్లను టీటీడీ రద్దు చేసింది.

News December 29, 2025

వచ్చారు.. వెళ్లారు

image

TG: ఇటీవల ప్రెస్‌మీట్ తర్వాత KCR అసెంబ్లీ సెషన్‌లో పాల్గొంటారని జోరుగా చర్చ జరిగింది. ప్రతిపక్ష నేత హోదాలో ఇవాళ సభకు హాజరైన ఆయన కేవలం రెండు నిమిషాలు మాత్రమే ఉన్నారు. జాతీయ గీతాలాపన తర్వాత సభను వీడటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కాగా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై మీడియా సమావేశంలో ప్రభుత్వాన్ని నిలదీసిన ఆయన JAN 2, 3న నదీ జలాలపై జరిగే చర్చలో పాల్గొంటారని గులాబీ కార్యకర్తలు అంటున్నారు.

News December 29, 2025

REWIND: తెనాలిలో ఈ ఏడాది జరిగిన సంచలన ఘటన ఇదే..!

image

తెనాలిలో ఈ ఏడాది జరిగిన ఓ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. కానిస్టేబుల్‌పై దాడి కేసులో ముగ్గురు వ్యక్తులను పోలీసులు నడిరోడ్డుపై కూర్చోబెట్టి అరికాళ్లపై కొట్టడం తీవ్ర కలకలం రేకెత్తించింది. ఇది జరిగిన నెల రోజుల తర్వాత మే 20న వీడియో వెలుగులోకి వచ్చింది. నిందితులను పరామర్శించేందుకు జూన్ 3న వైఎస్ జగన్ తెనాలి రావడం కూడా విమర్శలకు కారణమైంది. పోలీసుల చర్యలను కొందరు సమర్ధించగా మరికొందరు వ్యతిరేకించారు.