News December 23, 2025
ఆదిలాబాద్: INTER విద్యార్థులకు గమనిక

ఇంటర్మీడియట్ విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించని వారికి బోర్డు మరొక అవకాశం కల్పించినట్లు ఆదిలాబాద్ DIEO జాధవ్ గణేష్ కుమార్ తెలిపారు. ఈ నెల 16తోనే ఫీజు చెల్లింపు గడువు ముగియగా దానిని ఈ నెల 31 వరకు అపరాధ రుసుము రూ.2000తో పొడగించినట్లు తెలిపారు. ఇంకా ఫీజు చెల్లించని మొదటి, రెండవ సంవత్సర విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఫీజు చెల్లించాలని సూచించారు.
SHARE IT..
Similar News
News December 26, 2025
పాక్‌కు ఉగ్ర సంస్థ సవాలు.. ఎయిర్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని ప్రకటన

పాకిస్థాన్‌కు ఉగ్ర సంస్థ TTP(తెహ్రీకే తాలిబన్ పాకిస్థాన్) తలనొప్పిగా మారింది. 2026లో తాము ఎయిర్ ఫోర్స్ యూనిట్‌ను ఏర్పాటు చేస్తామని సంచలన ప్రకటన చేసింది. మిలిటరీ యూనిట్లు, ప్రావిన్స్‌లలో మోహరింపుల గురించి వెల్లడించింది. మిలిటరీ కమాండర్లతో 2 పర్యవేక్షణ జోన్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. కాగా పాక్ సైన్యంపై TTP టెర్రరిస్టులు పలు దాడులు చేశారు. అఫ్గాన్ నుంచి TTP ఆపరేట్ అవుతోందని పాక్ ఆరోపిస్తోంది.
News December 26, 2025
జాతీయస్థాయి బాక్సింగ్ పోటీలకు ఎల్లారెడ్డి గురుకుల విద్యార్థి

ఎల్లారెడ్డి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థి జాతీయ స్థాయికి ఎంపికైనట్లు ప్రిన్సిపల్ నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్రస్థాయిలో బాక్సింగ్‌లో గోల్డ్ మెడల్స్ సాధించి జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. విద్యార్థి సిహెచ్ వివేక్ చిన్నతనం నుంచి బాక్సింగ్ అంటే ఎంతో ఇష్టంగా అకాడమీలో ఉంటూ మంచి శిక్షణ పొందారు. ఎల్లారెడ్డి గురుకుల పాఠశాల పేరు జాతీయస్థాయిలో నిలిపారని కొనియాడారు.
News December 26, 2025
బయ్యారం: కరెంట్ షాక్‌తో ఉద్యోగి మృతి

బయ్యారం మండలంలో విషాదం చోటుచేసుకుంది. కొత్తపేట సబ్ స్టేషన్ పరిధి కాచనపల్లికి చెందిన ఓ రైతు తమ విద్యుత్ మోటారుకు ఫీజులు ఆగడం లేదని ఫిర్యాదు చేశారు. దీంతో విద్యుత్ శాఖ కాంట్రాక్టు ఉద్యోగి ఊకే వెంకటేశ్వర్లు పరీక్షిస్తుండగా కరెంట్ షాక్‌తో మృతి చెందాడు. ఘటన సబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


