News December 23, 2025
నేటి నుంచి జగన్ పులివెందుల పర్యటన

AP: వైసీపీ అధినేత జగన్ నేటి నుంచి 3 రోజుల పాటు పులివెందులలో పర్యటించనున్నారు. ఇవాళ 4pmకు పులివెందుల చేరుకొని భాకరాపురం క్యాంప్ ఆఫీసులో ప్రజాదర్బార్ నిర్వహిస్తారు. 24న ఉదయం ఇడుపులపాయకు వెళ్లి క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. 1pmకు మళ్లీ పులివెందులలో ప్రజాదర్బార్ నిర్వహిస్తారు. 25న 8.30amకు CSI చర్చిలో జరిగే క్రిస్మస్ వేడుకలకు హాజరవుతారు. 10.30amకు పులివెందుల నుంచి తిరుగుపయనమవుతారు.
Similar News
News December 25, 2025
NCERT 173 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

<
News December 25, 2025
తిరుమల క్షేత్రపాలుడిగా పరమశివుడు

తిరుమల కేవలం వైష్ణవ క్షేత్రమే కాదు. శైవ సామరస్యానికి వేదిక కూడా! శ్రీవారు ఇక్కడ కొలువై ఉంటే, ఆయనకు రక్షకుడిగా, క్షేత్రపాలుడిగా పరమశివుడు ‘రుద్రుడి’ రూపంలో కొలువై ఉంటారు. తిరుమల కొండపై ఉన్న ‘గోగర్భ తీర్థం’ వద్ద శివుడు క్షేత్రపాలకత్వ బాధ్యతలు నిర్వహిస్తారట. శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు క్షేత్రపాలుడిని కూడా స్మరించుకోవడం ఆచారంగా వస్తోంది. హరిహరుల మధ్య భేదం లేదని ఈ క్షేత్రం చాటిచెబుతోంది.
News December 25, 2025
విశాఖ స్టీల్ ప్లాంటులో మూడో విడత VRS

AP: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో 3వ విడత VRSకు యాజమాన్యం నోటిఫికేషన్ ఇచ్చింది. 2027 JAN 1 తర్వాత పదవీ విరమణకు అర్హులయ్యే ఉద్యోగుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. 15ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకొని 45ఏళ్లు దాటిన ఉద్యోగులను అర్హులుగా పేర్కొంది. ఈ ఏడాది ప్రారంభంలో తొలిసారి 1,146, రెండోసారి 487 మంది VRSకు అంగీకరించారు. ఈసారి 570 మందికి వీఆర్ఎస్ ఇవ్వాలనే లక్ష్యంతో నోటిఫికేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది.


