News December 23, 2025

పల్నాడు జిల్లాలోని లాడ్జిలో వ్యభిచారం గుట్టురట్టు!

image

నరసరావుపేట రైల్వే స్టేషన్ రోడ్డులోని ఓ లాడ్జిలో వ్యభిచారం నిర్వహిస్తుండగా ఎస్ఐ అరుణ తన సిబ్బందితో సోమవారం రాత్రి మెరుపు దాడి చేశారు. ఈ దాడులలో బాపట్ల జిల్లా సంతమాగులూరు చెందిన షేక్ గౌస్ బాజీ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కాగా నరసరావుపేటలో వ్యభిచార గృహాలపై పోలీసులు వరుసగా దాడులు చేస్తున్నా పదేపదే వ్యభిచారం నిర్వహిస్తూ మళ్లీమళ్లీ పట్టు బడుతున్నారు.

Similar News

News December 24, 2025

SRCL: ‘ఉత్తమ వైద్య సేవలు అందించి గుర్తింపు పొందాలి’

image

మెడికల్ కళాశాలలో వైద్య విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు రోగులకు మెరుగైన, ఉత్తమ వైద్య సేవలు అందించి గుర్తింపు పొందాలని ఇన్‌ఛార్జ్ కలెక్టర్ గరీమా అగర్వాల్ ఆకాంక్షించారు. సిరిసిల్ల ప్రభుత్వ మెడికల్ కాళాశాలలో వైట్ కోట్ సెర్మనీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రోగ్రాంను ప్రారంభించారు. పలువురు వైద్య విద్యార్థులకు వైట్ కోట్లు అందజేశారు.

News December 24, 2025

మేకర్స్ Vs థియేటర్ ఓనర్స్.. ఫ్యాన్స్ వర్రీస్

image

టికెట్ రేట్ కంటే థియేటర్ల పాప్‌కార్న్ ధరే ఎక్కువన్న డైరెక్టర్ తేజ <<18658964>>కామెంట్స్<<>> చర్చనీయాంశమయ్యాయి. అది వాస్తవమే అయినా ప్రీమియర్స్ పేరిట టికెట్ ధరను రూ.600 చేయడం కరెక్టేనా? ఒకప్పుడు 10/20 రూపాయలకే టాకీస్‌లో సినిమా చూసిన సామాన్య సినీ అభిమాని ఇప్పుడు థియేటర్‌ అంటేనే ‘అమ్మో’ అంటున్నాడు. టికెట్ ధరలు భారీగా పెంచడంతో పాటు పాప్‌కార్న్, కూల్‌డ్రింక్స్ పేరిట దోపిడీతో సినిమా చూడాలంటే వేల రూపాయలు పెట్టాల్సిందే.

News December 24, 2025

చిరుత ఆచూకీ కోసం గ్రామస్థులతో అధికారుల ఆపరేషన్

image

చిరుతపులి ఆచూకీ కోసం అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. మానాల సమీపంలోని గుట్టల్లో చిరుత పులి సంచరిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో గ్రామస్థులతో కలిసి అటవీ శాఖ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఫారెస్ట్ బీట్ అధికారి బాలకృష్ణ నేతృత్వంలో అటవీ సిబ్బంది, గ్రామస్థులు చిరుత కనిపించినట్లు చెబుతున్న ప్రాంతంతో పాటు సమీప పరిసరాల్లో గాలిస్తున్నారు.