News December 23, 2025

సిద్దిపేట: ఐదుగురితో పోటీ.. ఒక్క ఓటుతో గెలుపు

image

బెజ్జంకి మండలం పెరుకబండ గ్రామ సర్పంచ్‌గా కర్రావుల స్వప్న సోమవారం బాధ్యతలు చేపట్టారు. జనరల్ కేటగిరీలో ఐదుగురు పురుష అభ్యర్థులతో పోటీపడి, కేవలం ఒక్క ఓటు మెజారిటీతో ఆమె సంచలన విజయం సాధించారు. స్వప్న మాట్లాడుతూ.. తన గెలుపునకు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలుపుతూ, పాలకవర్గ సభ్యులతో కలిసి గ్రామాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు గ్రామస్థులు పాల్గొన్నారు.

Similar News

News January 17, 2026

హైదరాబాద్‌కు ‘ఊపిరి’.. పెరిగిన గాలి నాణ్యత

image

కాలుష్యానికి కేరాఫ్‌గా మారిన హైదరాబాద్‌కు కొంత ఉపశమనం లభించింది. సంక్రాంతి పండుగ సెలవుల్లో చాలామంది సొంతూళ్లకు వెళ్లడంతో గాలి నాణ్యత కొంతమేర పెరిగింది. చాలా ప్రాంతాల్లో ఏక్యూఐ 50 కంటే తక్కువగా నమోదయింది. ఇది మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు. వాహనాల అనవసర వాడకం తగ్గితే మంచి ఫలితం ఉంటుంది. అయితే సొంతూళ్లకు వెళ్లినవారు తిరిగివస్తే మళ్లీ అదే తంతు ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

News January 17, 2026

IAFకి మరింత బలం.. 114 రాఫెల్ జెట్ల కొనుగోలుకు ఆమోదం

image

ఇండియన్ డిఫెన్స్ ప్రొక్యూర్‌మెంట్ బోర్డు మరో 114 రాఫెల్ జెట్ల కొనుగోలుకు ఆమోదం తెలిపింది. ₹3.25లక్షల కోట్ల విలువైన ఈ డీల్‌కు డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్, క్యాబినెట్ కమిటీ ఫైనల్ అప్రూవల్ ఇవ్వాల్సి ఉంది. FEBలో ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మాక్రాన్ IND పర్యటనలో డీల్ ఫైనలైజ్ అవ్వొచ్చు. ఫ్రెంచ్ కంపెనీ డసాల్ట్ ఏవియేషన్ సహకారంతో 60%+ స్వదేశీ కంటెంట్‌తో ఇవి తయారు కానున్నాయి. IND రాఫెల్స్ సంఖ్య 176కి పెరగనుంది.

News January 17, 2026

TU: ఈ నెల 21 నుంచి పరీక్షలు

image

టీయూ పరిధిలోని ఇంటిగ్రేటెడ్ పీజీ (APE/PCH)-3, 5, IMBA-3, 5, LLB, LLM-3, B.Ed, B.P.Ed-1,3వ సెమిస్టర్ల పరీక్షలు ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్నాయని COE ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. LLB పరీక్షలు ఈ నెల 21 నుంచి ఫిబ్రవరి 4 వరకు, LLM పరీక్షలు ఈ నెల 21, 23 తేదీల్లో, ఇంటిగ్రేటెడ్ PG, IMBA పరీక్షలు ఈ నెల 21 నుంచి ఫిబ్రవరి 11 వరకు B.Ed పరీక్షలు 21 నుంచి 31 వరకు, B.P.Ed 21 నుంచి 24 వరకు జరగనున్నాయి.