News December 23, 2025
పల్నాడు జిల్లాలోని లాడ్జిలో వ్యభిచారం గుట్టురట్టు!

నరసరావుపేట రైల్వే స్టేషన్ రోడ్డులోని ఓ లాడ్జిలో వ్యభిచారం నిర్వహిస్తుండగా ఎస్ఐ అరుణ తన సిబ్బందితో సోమవారం రాత్రి మెరుపు దాడి చేశారు. ఈ దాడులలో బాపట్ల జిల్లా సంతమాగులూరు చెందిన షేక్ గౌస్ బాజీ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కాగా నరసరావుపేటలో వ్యభిచార గృహాలపై పోలీసులు వరుసగా దాడులు చేస్తున్నా పదేపదే వ్యభిచారం నిర్వహిస్తూ మళ్లీమళ్లీ పట్టు బడుతున్నారు.
Similar News
News December 24, 2025
అగ్రిటెక్ స్టార్టప్‌లను ప్రోత్సహించాలి: కలెక్టర్ ఆనంద్

వ్యవసాయ రంగంలో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని, రైతుల సమస్యల పరిష్కారానికి అగ్రిటెక్ స్టార్టప్‌లను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. బుధవారం వ్యవసాయ, ఉద్యాన, అనుబంధ రంగాల అధికారులతో పాటు రైతు ఉత్పత్తిదారుల సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఆధునిక పద్ధతుల ద్వారా సాగు ఖర్చులు తగ్గించి, రైతులకు లాభసాటిగా మార్చేందుకు కృషి చేయాలని సూచించారు.
News December 24, 2025
రాఘవపూర్ పల్లె దవాఖానలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

ఆలేరు మండలం రాఘవాపురం గ్రామంలోని పల్లె దవాఖానను జిల్లా కలెక్టర్ హనుమంతురావు ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో సిబ్బంది ఎవరూ లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఎల్‌హెచ్‌పీ సరిత, ఆశా కార్యకర్తకి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని జిల్లా వైద్యశాఖ అధికారికి ఆదేశాలు జారీ చేశారు. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
News December 24, 2025
అల్లూరు జిల్లాలో విషాదం.. క్రిస్మస్ పండుగకు ఇంటికి వెళుతుంటే..

చింతూరు(M)లో పంచాయతీ కార్యదర్శులుగా చేస్తున్న <<18661155>>గెడ్డం సందీప్, పెయ్యల విద్యాసాగర్<<>> బుధవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే వారు గురువారం క్రిస్మస్ పండుగ అని అమలాపురం ఇంటికి వెళుతుండగా ఐ.పోలవరం వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ ప్రమాదంపై తోటి ఉద్యోగులు శోకసంద్రంలో ఉన్నారు. జిల్లా అధికారులు సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.


