News December 23, 2025

WGL: ఉదయం 6 గంటలకే సర్పంచ్ ఏం చేశారో చూడండి..!

image

జిల్లాలోని వర్ధన్నపేట మండలం ఇల్లంద సర్పంచ్‌గా ప్రమాణ స్వీకారం చేసిన బేతి సాంబయ్య తొలి రోజే కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. ఉదయం 6 గంటలకే పంచాయతీ కార్యాలయానికి చేరుకొని పారిశుద్ధ్య కార్మికుల రికార్డులను పరిశీలించారు. ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి, పార్టీలకతీతంగా అందరి సహకారంతో గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని ఆయన తెలిపారు. విధుల పట్ల అధికారులు, సిబ్బంది అలసత్వం వహించొద్దన్నారు.

Similar News

News January 15, 2026

అనకాపల్లి: పండగపూట విషాదం

image

నక్కపల్లి హైవే వద్ద అడ్డరోడ్డు వెళ్లే మార్గంలో గురువారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో గాయపడిన యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్ఐ సన్నిబాబు చెప్పారు. ఎస్.రాయవరం (M) గెడ్డపాలేనికి చెందిన దాడిశెట్టి పవన్ (19) తన స్నేహితులతో బైకుపై వెళ్లున్నాడు. ఈ క్రమంలో నక్కపల్లి పాత ఇసుక ర్యాంప్ హైవే వద్ద లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. పవన్ మృతి చెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు.

News January 15, 2026

ఉట్నూర్: గిరిజన ఉద్యాన కేంద్రంలో తీరొక్క మొక్కలు

image

ఉట్నూర్ మండల కేంద్రంలో ఉన్న ఐటీడీఏ ప్రాంగణ ప్రాంతంలోని గిరిజన ఉద్యాన కేంద్రంలో అనేక రకాల మామిడి మొక్కలు, పండ్ల మొక్కలు, పూల మొక్కలను విక్రయిస్తున్నారు. ఇది ఐటీడీఏ ఆధ్వర్యంలో నడుస్తోంది. ఇక్కడ అలంకరణ మొక్కలు, గిఫ్ట్ మొక్కలు బయటి కేంద్రంలో కంటే తక్కువ ధరలోనే దొరుకుతాయి. ఉట్నూర్ మండల ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.

News January 15, 2026

లోయర్ క్లాస్ జాబ్స్ కాదు బాబాయ్.. అసలైన డిమాండ్ వీరికే..

image

Ai దెబ్బకు భవిష్యత్‌లో వైట్ కాలర్ జాబ్స్ భారీగా తగ్గిపోతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్లంబర్, ఎలక్ట్రిషియన్, కార్పెంటర్.. లాంటి వృత్తులకు భారీ డిమాండ్ ఉంటుందని చెబుతున్నారు. వీటిని యువత లోయర్ క్లాస్ ఉద్యోగాలుగా చూస్తోందని, కానీ హై డిమాండ్ దృష్ట్యా వీటికే ఫ్యూచర్ ఉంటుందని అంటున్నారు. ప్రస్తుత రోజుల్లోనే ఓ ప్లంబర్ ఇంటికి వచ్చి చెక్ చేస్తే రూ.500 తీసుకుంటున్నాడని గుర్తు చేస్తున్నారు. COMMENT?