News December 23, 2025

పార్వతీపురం: పురుగుల మందు తాగి వ్యక్తి మృతి

image

మక్కువ మండలం కొయ్యనపేట గ్రామానికి చెందిన బేతనపల్లి సీతం నాయుడు (75) ఈ నెల 15వ తేదీన పురుగుల మందు తాగారు. అప్పటి నుంచి పార్వతీపురం జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందారు. ఈ ఘటనపై మక్కువ ఎస్ఐ ఎం.వెంకటరమణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

Similar News

News January 9, 2026

ఆసిఫాబాద్‌‌లో మున్సిపల్ అభ్యర్థుల వేట

image

జిల్లాలోని రెండు మున్సిపాలిటీల్లోని 50 వార్డులకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ముమ్మరం చేశాయి. రిజర్వేషన్లు ఖరారు కాకముందే ఆశావహుల బలాబలాలపై రహస్య సర్వేలు నిర్వహిస్తున్నాయి. బీసీ, జనరల్ రిజర్వేషన్లను దృష్టిలో ఉంచుకుని కులాల వారీగా ఒక్కో వార్డు నుంచి ఇద్దరు అభ్యర్థుల పేర్లను సేకరిస్తున్నాయి. సామాజిక సమీకరణాలే గెలుపు గుర్రాలుగా భావిస్తూ అడుగులు వేస్తున్నాయి.

News January 9, 2026

సంక్రాంతికి ఫ్రీ టోల్‌ లేనట్లే!

image

సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై టోల్‌ మినహాయింపు ఉండదని కేంద్రం స్పష్టం చేసింది. పండుగ రోజుల్లో ట్రాఫిక్ రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో జనవరి 9 నుంచి 18 వరకు టోల్‌ ఫ్రీగా ప్రకటించాలని TG మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, TDP ఎంపీ సానా సతీశ్ బాబు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కోరారు. అయితే ఈ హైవేపై ఉచిత టోల్‌కు అనుమతి ఇవ్వలేమని కేంద్రం తెలియజేసినట్లు సమాచారం.

News January 9, 2026

త్వరగా స్థలాలను గుర్తించాలి: ప్రకాశం కలెక్టర్

image

ఎంఎస్ఎంఈ పార్కులకు త్వరగా స్థలాలను గుర్తించాలని ప్రకాశం కలెక్టర్ రాజబాబు తెలిపారు. గురువారం రాష్ట్ర సచివాలయం నుంచి సీఎస్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఒంగోలు కలెక్టరేట్ నుంచి కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. అందుకు అనుగుణంగా అధికారులు సైతం తగిన స్థలాలను గుర్తించాలన్నారు.