News April 22, 2024

పగో: నేడే ఫలితాలు.. ఉత్కంఠతో 27,426 మంది

image

ప.గో జిల్లాలో 27,426 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలకు హాజరుకాగా.. వారందరూ ఫలితాల కోసం ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. జిల్లాలో 14,624 మంది బాలురు, 12,802 మంది బాలికలు కలిపి మొత్తం 27,426 మంది విద్యార్థులు 127 కేంద్రాల్లో మార్చి 18 నుంచి 30 వరకు పరీక్షలు రాశారు. గతేడాది జిల్లాలో 65.93 శాతం ఉత్తీర్ణత సాధించగా.. ఈ ఏడాది 100% ఉత్తీర్ణతే లక్ష్యంగా యంత్రాంగం కసరత్తు చేసిందని అధికారులు తెలిపారు.

Similar News

News November 24, 2024

కాకినాడ: టీచర్‌ను కొట్టుకుంటూ తీసుకెళ్లారు

image

కాకినాడలోని ఓ మున్సిపల్ హైస్కూల్‌లో విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించిన టీచర్‌ను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. గుడ్ టచ్.. బ్యాడ్ టచ్‌పై అవగాహన కల్పించేందుకు పాఠశాలకు వచ్చిన మహిళా పోలీసులకు తమ ఒంటిపై చేతులు వేసి టీచర్ అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని విద్యార్థులు వాపోయారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు టీచర్‌కు దేహశుద్ధి చేశారు. పోలీసులు వారికి సర్దిచెప్పి ఉపాధ్యాయుడిని పీఎస్‌కు తరలించారు.

News November 23, 2024

రాజవొమ్మంగి: 35 గోల్డ్ మెడల్స్ గెలిచిన ఒకే పాఠశాల విద్యార్థులు

image

తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలంలోని ఏకలవ్య పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీల్లో 35 గోల్డ్ మెడల్స్, 4 సిల్వర్, 4 బ్రాంజ్ మెడల్స్ కైవసం చేసుకున్నారని ప్రిన్సిపల్ కృష్ణారావు శనివారం మీడియాకు తెలిపారు. అరకులో జరిగిన జూడో, వెయిట్ లిఫ్టింగ్, యోగా, వాలీబాల్ క్రీడల్లో విజేతలుగా నిలిచారని చెప్పారు. విజేతలతోపాటు వారికి శిక్షణ ఇచ్చిన సిబ్బందిని సైతం ప్రిన్సిపల్, టీచర్స్ అభినందించారు.

News November 23, 2024

లక్కీఛాన్స్ కొట్టిన పి.గన్నవరం వాయిస్ ఆర్టిస్టు

image

నేషనల్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్, నెట్ ఫ్లెక్స్ సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో ప్రచారం కానున్న ఆజాదీకా అమృత కహానియా డాక్యుమెంటరీకి తెలుగు భాష నుంచి వాయిస్ ఆర్టిస్టుగా పి.గన్నవరానికి చెందిన అడ్డగళ్ల రాధాకృష్ణను శుక్రవారం ఎంపిక చేశారు. 8 భాషలకు 8 మందిని బెస్ట్ వాయిస్ ఆర్టిస్టులను ఎంపిక చేయగా తెలుగు భాష నుంచి ఆ అవకాశం రాధాకృష్ణకు దక్కింది. ఈయన గతంలో పలు టీవీల్లో న్యూస్ రీడర్‌గా పనిచేశారు.