News December 23, 2025

శ్రీకాకుళం: ‘రూ.80 వేలు కడతావా.. అరెస్ట్ అవుతావా’

image

డిజిటల్ అరెస్ట్ పేరుతో ఓ యువకుడు వద్ద సైబర్ నేరగాళ్లు డబ్బులు దోచేసిన ఘటన పాతపట్నంలో చేటుచేసుకుంది. నరసింహానగర్-2లో నివాసముంటున్న వెంకట భీష్మ నేతజీకి ఓ నంబర్ నుంచి సెప్టెంబర్ 23న ఫోన్ చేసి మీరు డిజిటల్ ఆరెస్ట్ అయ్యారని రూ.80 వేలు చెల్లిస్తారా, అరెస్ట్ అవుతారా అని బెదిరించారు. అతడు బయపడి రూ.80వేలు చెల్లించాడు. మోసపోయానని తెలుసుకున్న అతడు సోమవారం సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్‌ 1930 ఫిర్యాదు చేశాడు.

Similar News

News March 8, 2026

శ్రీకాకుళం: రోడ్డు ప్రమాదంలో ఆర్మీ జవాన్ మృతి

image

కంచిలి మండలం బొనమాలి గ్రామానికి చెందిన బీ.బాలకృష్ణ (29) అనే ఆర్మీ జవాన్ శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. తన బంధువు పెళ్లి పిలుపులు కోసం ఒరిశా ప్రాంతానికి బైక్‌పై వెళ్లి తిరిగి వస్తుండగా కొత్త శాసనం వద్దకు వచ్చే సరికి ఎదురుగా వస్తున్న మరో బైక్‌ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనలో మరో ఇద్దరు గాయపడగా చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

News March 8, 2026

శ్రీకాకుళం: ‘రైతులు 365 రోజులు సాగుకు ప్రాధాన్యత నివ్వాలి’

image

రైతులు 365 రోజులు సాగుకు ప్రాధాన్యత నివ్వాలని జిల్లా ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్ట్ మేనజర్ పూజారి సత్యనారాయణ అన్నారు. శ్రీకాకుళం, రణస్థలం, నరసన్నపేట పరిధిలో ఉన్న ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ఎఫ్ఎంటీఎస్‌కు శ్రీకాకుళంలోని నైరాలో శనివారం శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. కూరగాయలు, ఆకుకూరలు, ఉద్యాన వన పంటల సాగుతో ఏడాది పాటు రైతులకు ఆదాయం వస్తుందని చెప్పారు.