News December 23, 2025
మేడారానికి 36 రోజులే.. నత్తనడకన పనులు!

మేడారం జాతరకు మరో 36 రోజులే గడువు ఉంది. సరిగ్గా జాతరకు 15 రోజుల ముందు నుంచే అమ్మవార్లను దర్శించుకునేందుకు జనం వస్తుంటారు. జాతర ప్రాంతంలో జరుగుతున్న పనులు నెమ్మదిగా కొనసాగుతన్నాయి. మరోపక్క మేడారానికి చేరుకునే రోడ్లపై ఉన్న వంతెనలు పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. జాతర పనులను సమ్మక్క మాల ధరించి అధికారులు అందరూ ఇక్కడే ఉండి పని చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినా, అంతా అప్ అండ్ డౌన్ చేస్తున్నారు.
Similar News
News December 29, 2025
భువనగిరి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల సందడి

భువనగిరి జిల్లాలోని 6 పట్టణ స్థానిక సంస్థలు ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్లు అధికారిక జాబితా వెల్లడించింది. భువనగిరి మున్సిపాలిటీలో 35 వార్డులు, జనాభా ఓటర్లు 47913, మోత్కూరు 12 వార్డులు, ఓటర్లు 14423, ఆలేరు 12 వార్డులు, ఓటర్లు 13526, చౌటుప్పల్ 20 వార్డులు ఓటర్లు 27300, పోచంపల్లి 13 వార్డులు, ఓటర్లు 15665, యాదగిరిగుట్ట 12 వార్డులు, ఓటర్లు 13526గా నమోదయ్యాయి.
News December 29, 2025
సిరిసిల్ల: సీఎస్, ఉత్తమ్‌కు కేటీఆర్ ఫోన్

కాళేశ్వరం 11వ ప్యాకేజీ కాలువల నిర్మాణం కోసం భూమిని సేకరించి, దానికి సంబంధించిన బిల్లులను పెండింగ్‌లో పెట్టడంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. తంగళ్లపల్లి మండల మాజీ సర్పంచులు ఆయనను కలిసి సమస్యను వివరించడంతో ఆయన మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సీఎస్ రామకృష్ణారావులతో ఫోన్‌లో మాట్లాడారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న రూ.3.19 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు.
News December 29, 2025
ఖమ్మం జిల్లాలో మున్సిపాలిటీలు సమాయత్తం

ఖమ్మం జిల్లాలో ఎదులాపురంలో 32 వార్డుల్లో 38,210 జనాభా ఎస్సీలు 4,024, ఎస్సీలు 8,770.. సత్తుపల్లి (23)లో 31,857 మంది జనాభా, ఎస్సీలు 4,765, ఎస్టీలు 1,996.. కల్లూరు (20)లో 22,748 జనాభా, ఎస్టీలు 3,732, ఎస్సీలు 5,516, వైరా(20)లో 31,056 జనాభా ఉండగా ఎస్టీలు 2,090, ఎస్సీలు 7,227, మధిర(22) 30,856 జనాభా, ఎస్టీలు 1083, ఎస్సీలు 8,322.


