News December 23, 2025
చౌటుప్పల్: సర్పంచ్ మాట నిలబెట్టుకున్నారు

ధర్మాజీగూడెం సర్పంచ్ జువ్వి నరసింహ తన పదవీ బాధ్యతలు చేపట్టిన తొలిరోజే ఇచ్చిన మాట నిలబెట్టుకొని ఆదర్శంగా నిలిచారు. ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన విధంగా.. గ్రామంలో ప్రధాన సమస్యగా మారిన కోతుల బెడదను నివారించేందుకు రూ.1 లక్ష విరాళాన్ని సోమవారం గ్రామ పెద్దలకు అందజేశారు. కోతుల సమస్య నుంచి గ్రామాన్ని విముక్తం చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు.
Similar News
News December 25, 2025
బంగ్లాకు తారిఖ్ రీఎంట్రీ: భారత్‌కు కలిసొచ్చేనా?

17 ఏళ్ల తర్వాత బంగ్లా డార్క్ ప్రిన్స్ తారిఖ్ రెహమాన్ స్వదేశానికి రానుండడాన్ని పెను మార్పుగా దౌత్యవేత్తలు అభివర్ణిస్తున్నారు. భారత్‌కు సానుకూల అంశంగా విశ్లేషిస్తున్నారు. బంగ్లాలో రెచ్చిపోతున్న మత ఛాందసవాదులు, జమాత్ ఏ ఇస్లామీ లాంటి యాంటీ ఇండియా, పాకిస్థాన్ అనుకూల శక్తులకు చెక్ పెట్టడానికి తారిఖ్ నాయకత్వంలోని BNP కీలకం కానుంది. అక్కడ సుస్థిర ప్రభుత్వం ఏర్పడితే భారత్‌తో సంబంధాలు మెరుగుపడతాయి.
News December 25, 2025
ముక్కోటి ఏకాదశికి సింహాచలం వెళ్తున్నారా?

సింహాచలంలో డిసెంబర్ 30న జరగనున్న ముక్కోటి ఏకాదశి దర్శనం టికెట్లు ఆన్లైన్‌లో అందుబాటులో తీసుకురానున్నారు. 100, 300, 500 రూపాయలు టికెట్స్ డిసెంబర్ 26 నుంచి 29 వరకు అందుబాటులో ఉంచుతారు. దర్శనానికి టికెట్లు ఆన్లైన్లో మాత్రమే ఇస్తున్నారు. www.aptemples.org, 9552300009 మన మిత్ర వాట్సాప్ నెంబర్ ద్వారా టికెట్స్ బుక్ చేసుకోవచ్చ. ముక్కోటి ఏకాదశికి సింహాచలం వెళ్లే ఈ విషయాన్ని భక్తులు గమనించాలి.
News December 25, 2025
మెదక్: పేదల దేవుళ్లకు 6దశాబ్దాలుగా పూజలు

కమ్యూనిస్టు ఉద్యమంలో చురుగ్గా పాల్గొని అకాల మరణం పొందిన కామ్రెడ్ కేవల్ కిషన్, లక్ష్మయ్యలు పేదల దేవుళ్లయ్యారు. పీడితుల విముక్తి నుంచి పోరాడి కూరుకుపోయిన భూస్వామ్యాన్ని కూల్చి సమాజ సమానత్వానికై పోరాడారు. కేవల్ కిషన్, ఆయన మిత్రుడు లక్ష్మయ్య ప్రమాదంలో మరణించి ఆరు దశాబ్దాలు గడిచింది. చేగుంట మండలం పొలంపల్లిలో గుడి కట్టి ఆరాధిస్తున్నారు. వారి వర్దంతి సందర్బంగా రేపు జాతర జరగనుంది.


