News December 23, 2025
నేడు గద్వాల్, వనపర్తి జిల్లాలో గవర్నర్ పర్యటన

రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈరోజు వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో పర్యటించనున్నారు. అలంపూర్ జోగుళాంబ ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం గద్వాల కలెక్టరేట్‌లో చేనేత స్టాళ్లను పరిశీలిస్తారు. వనపర్తి కలెక్టరేట్‌లో అభివృద్ధి పథకాల స్టాళ్ల సందర్శన, మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటారు. రెండు జిల్లాలకు చెందిన ప్రముఖ కవులు, కళాకారులు, జాతీయ స్థాయి ప్రతిభావంతులతో గవర్నర్ ప్రత్యేకంగా భేటీ కానున్నారు.
Similar News
News January 12, 2026
HYD: హాస్టళ్లలో నో ఫుడ్!

సంక్రాంతి సెలవులు వస్తే HYDలో ఉండే బ్యాచ్‌లర్లకు తిండి కష్టాలు వస్తాయని వాపోతున్నారు. DSNR, అమీర్‌పేట్, హైటెక్స్, KPHB తదితర ఏరియాల్లో ప్రైవేట్ హాస్టళ్ల యాజమాన్యాలు వారం రోజులు నోఫుడ్ బోర్డు పెట్టేశాయి. ఉద్యోగులు, విద్యార్థులకు ఇబ్బందులు తప్పవంటున్నారు. ఇక్కడే ఉండేవారు బయట తిందామంటే హోటళ్లూ బంద్ ఉన్నాయని ఆవేద వ్యక్తం చేశారు. యాజమాన్యం తమ కోణంలో ఆలోచించి ఫుడ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

FLASH: ఖమ్మం: కోడికత్తితో బాలుడి దాడి

చింతకాని మండలం నాగిలిగొండలో సోమవారం కోడికత్తితో ఓ యువకుడిపై దాడి జరిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. సమాచారం ప్రకారం.. గేదెలు మేపే దగ్గర ఎదురైన గొడవతో గ్రామానికి చెందిన ఓ బాలుడు.. చాట్ల జాషువాపై కోడికత్తితో దాడి చేసి పొడిచినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన జాషువాను గ్రామస్థులు వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది.