News December 23, 2025
వింటర్‌లో గర్భిణులకు ఈ జాగ్రత్తలు

శీతాకాలంలో ఇమ్యునిటీ తక్కువగా ఉండటం వల్ల గర్భిణులు అనేక సమస్యలు ఎదుర్కొంటారు. ఇలా కాకుండా ఉండాలంటే విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. చాలా చల్లగా ఉండే ఆహార పదార్థాలను తినడం మానుకోండి. తేలికపాటి వ్యాయామాలు చెయ్యాలి. ఎప్పటికప్పుడు ప్రినేటల్ చెకప్‌లు చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
Similar News
News December 27, 2025
పాక్‌ను వీడుతున్న డాక్టర్లు, ఇంజినీర్లు

మెరుగైన అవకాశాల కోసం పాక్ ప్రజలు ఇతర దేశాలకు క్యూ కడుతున్నారు. గత రెండేళ్లలో 5,000 మంది డాక్టర్లు, 11,000 మంది ఇంజినీర్లు, 13,000 మంది అకౌంటెంట్లు దేశం విడిచి వెళ్లారు. మరోవైపు పాక్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ ‘బ్రెయిన్ డ్రెయిన్’ (మేధావుల వలస) కాదు ‘బ్రెయిన్ గెయిన్’ అంటూ గతంలో చేసిన కామెంట్స్‌పై SMలో ఇప్పుడు సెటైర్లు పేలుతున్నాయి. ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని జనం మండిపడుతున్నారు.
News December 27, 2025
వ్యవసాయంలో ‘ఫర్టిగేషన్’ అంటే ఏమిటి?

నీటితో పాటు ద్రవరూపంలో ఉన్న ఎరువులను నిర్ణీత మోతాదులో కలిపి డ్రిప్ ద్వారా మొక్కలకు అందించే విధానాన్ని ‘ఫర్టిగేషన్’ అంటారు. ఈ విధానంలో నీటిలో కరిగే రసాయన, సేంద్రియ ఎరువులను మాత్రమే వాడాలి. పండ్లు, కూరగాయలు, పూల తోటలతో పాటు పత్తి, చెరకు, అరటి, మిరప, ఔషధ మొక్కల సాగుకు ఇది అనుకూలం. ఫర్టిగేషన్‌లో తక్కువ నీటితో సరైన మోతాదులో ఎరువులను అందించి లాభసాటి వ్యవసాయం చేయవచ్చని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.
News December 27, 2025
CBN ప్రభుత్వమని గుర్తుంచుకోండి: అనిత

AP: శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరినీ వదిలిపెట్టేది లేదని హోం మంత్రి అనిత హెచ్చరించారు. జంతుబలులు చేసి ఉన్మాదుల్లా ప్రవర్తిస్తామంటే కుదరదని చెప్పారు. రాష్ట్రంలో ఉన్నది CBN ప్రభుత్వం అని గుర్తుంచుకోవాలన్నారు. పార్టీ నేతలు చేసేది తప్పని చెప్పలేరా అని మండిపడ్డారు. ఆస్తి కోసం తల్లి, చెల్లెలిపై కేసులు పెట్టించిన వ్యక్తి మీ పిల్లల్ని రక్షిస్తారని అనుకుంటున్నారా అని ప్రశ్నించారు.


