News December 23, 2025

TPT : ఇలాంటి వ్యక్తి జనావాసంలో ఉంటే ముప్పే…!

image

తిరుచానూరు PS పరిధిలో గంజాయి విక్రయిస్తూ యువతను నాశనం చేస్తున్న భాగ్యరాజ్‌ (43)పై PIT NDPS చట్టం సెక్షన్ 3(1) కింద ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అతనిపై ఇప్పటికే 3 ఎన్‌డీపీఎస్ కేసులు నమోదు కాగా, వివిధ ఘటనల్లో 10 కిలోలకు పైగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. సామాజిక భద్రతకోసం ఈ కార్యకలాపాలను నియంత్రించేందుకు బాబు భాగ్యరాజ్‌ను కడప/నెల్లూరు కేంద్ర కారాగారంలో నిర్బంధించాలని ప్రభుత్వం ఆదేశించింది.

Similar News

News January 17, 2026

ఎయిర్ ‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

image

<>ఎయిర్ ‌పోర్ట్స్ <<>>అథారిటీ ఆఫ్ ఇండియా జాయింట్ వెంచర్ కంపెనీ చండీగఢ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్‌లో 12 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి డిగ్రీ, PG, CA, ICWA అర్హతతో పాటు పని అనుభవం గల వారు FEB 15వరకు అప్లై చేసుకోవచ్చు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఎగ్జిక్యూటివ్ పోస్టులకు నెలకు రూ.60K, మేనేజర్ పోస్టుకు రూ.70K చెల్లిస్తారు. వెబ్‌సైట్: www.aai.aero

News January 17, 2026

ఈనెల 19 నుంచి ఉచిత పశు వైద్య శిబిరాలు: కలెక్టర్

image

జిల్లాలోని అన్ని గ్రామాలలో ఈనెల 19 నుంచి ఉచిత పశు వైద్య శిబిరాలు నిర్వహణ చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ నాగరాణి తెలిపారు. జనవరి 19 నుంచి 31వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలలో ఉచిత పశు ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని పశుపోషకులకు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పశుసంవర్ధక శాఖ నిర్వహించి, పశుపోషకులకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ సూచించారు.

News January 17, 2026

మార్కాపురం జేసీ బాధ్యతలు స్వీకరణ

image

నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పులి శ్రీనివాసులు శనివారం తన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు కలెక్టరేట్‌కు చేరుకున్న శ్రీనివాసులుకు అధికారుల పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొని, శుభాకాంక్షలు తెలిపారు. గతంలో సిటీ కార్పొరేషన్ కమిషనర్‌గా పనిచేసిన విషయం తెలిసిందే.