News December 23, 2025
కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌కు కొత్త ఊపిరి!

వరంగల్ జిల్లాలోని కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్(కేఎంటీ)కు పీఎం మిత్ర పథకం ద్వారా కేంద్రం నిధులు లభించడంతో అభివృద్ధి వేగం పుంజుకుంది. ఇప్పటికే మూడు కంపెనీల ద్వారా రూ.3,862 కోట్ల పెట్టుబడులు, సుమారు 25 వేల ఉద్యోగాలు లభించనున్నాయి. కొత్తగా మరిన్ని దేశ, విదేశీ సంస్థలు ముందుకు రావడంతో మొత్తం లక్ష మందికి ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
Similar News
News December 25, 2025
భూపాలపల్లి: యాసంగి సాగు 1,26,805 ఎకరాల్లో

భూపాలపల్లి జిల్లాలో యాసంగి ప్రణాళిక 1,26,805 ఎకరాలు ఖరారు చేసినట్లు జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు తెలిపారు. వరి 97,570 ఎకరాలు, మొక్కజొన్న 29,540 ఎకరాల్లో, వేరుశెనగ, పెసర పంటలు సాగులో ఉన్నాయి. వరి పంట సేద్యానికి 22,567 క్వింటాల్లు, మొక్కజొన్న 2157 క్వింటాల్లు విత్తనాలు అవసరమని తెలిపారు. యూరియా 16,866 టన్నులు, ఫాస్పరస్ 6,887 టన్నులు, పొటాషియం 4688 టన్నులు అవసరమని డీఏఓ బాబురావు తెలిపారు.
News December 25, 2025
ENG టీమ్ హెడ్ కోచ్‌గా రవిశాస్త్రిని నియమించాలి: మాజీ క్రికెటర్

యాషెస్ సిరీస్ ఓటమితో ఇంగ్లండ్ క్రికెట్‌లో మార్పులు అవసరమని మాజీ క్రికెటర్ మోంటీ పనేసర్ సూచించారు. మెక్‌కల్లమ్ స్థానంలో రవిశాస్త్రిని ENG టీమ్ హెడ్ కోచ్‌గా నియమించాలన్నారు. ‘మానసికంగా, వ్యూహాత్మకంగా ఆస్ట్రేలియాను ఎలా ఓడించాలో తెలిసిన వారినే హెడ్‌కోచ్‌గా నియమించాలి. దానికి సరైన వ్యక్తి రవిశాస్త్రి. ఆయన గైడెన్స్‌లో 2018-19, 2020-21లో AUSపై IND టెస్ట్ సిరీస్‌లు గెలిచింది’ అని చెప్పారు.
News December 25, 2025
వైద్యం కోసం మహారాష్ట్రకు ADB ప్రజలు

వైద్యం కోసం ASF, ADB, నిర్మల్ జిల్లా ప్రజలు పక్కా రాష్ట్రం మహారాష్ట్రకు వెళ్తున్నారు. జిల్లాలో పెద్ద ప్రభుత్వ దవాఖానాలు ఉన్న కూడా సరైన వైద్య సదుపాయాలు, డాక్టర్లు అందుబాటులో ఉండటం లేదని ఆరోపణ. ఇక ప్రైవేటు దవాఖానాల్లో వైద్యం ఖరీదుగా ఉండటంతో సామాన్య మధ్య తరగతి ప్రజలు తక్కువ ఖర్చుతో మంచి వైద్యం దొరికే మహారాష్ట్రకు తరలివెళ్తున్నారు. చంద్రపూర్, నాగపూర్, సేవాగ్రాం వంటి ప్రాంతాలను ఆశ్రయిస్తున్నారు.


