News April 22, 2024
మచిలీపట్నం సెంటిమెంట్ కొనసాగుతుందా!
AP: కృష్ణా(D) మచిలీపట్నంలో ఏ పార్టీ గెలిస్తే రాష్ట్రంలో అదే పార్టీ అధికారంలోకి రావడం ఆనవాయితీగా వస్తోంది. 1983 నుంచి ఈ సెంటిమెంట్ కొనసాగుతోంది. మరో ఆనవాయితీ ఏంటంటే.. ఇక్కడ గెలిచి మంత్రి అయిన వారు ఆ తర్వాతి ఎన్నికల్లో ఓడిపోవడం. 1989లో కృష్ణమూర్తి(INC), 1999లో నరసింహారావు(TDP), 2014లో కొల్లురవీంద్ర గెలుపొందగా.. వీరు ఆ తర్వాత ఓడిపోయారు. మరి ఈసారి ఈ సంప్రదాయం కొనసాగుతుందో లేదో చూడాలి.
<<-se>>#ELECTIONS2024<<>>
Similar News
News November 20, 2024
భాస్కర –II ఉపగ్రహం విశేషాలు
1981లో సరిగ్గా ఇదే రోజు రష్యాలోని వోల్గోగ్రాడ్ ప్రయోగ వేదిక నుంచి భాస్కర –II ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగించింది. 444KGS బరువు ఉండే ఈ శాటిలైట్ పని చేసే కాలం ఒక సంవత్సరం కాగా, ఇది పదేళ్లు కక్ష్యలో తిరిగింది. భూ పరిశీలన కోసం ప్రయోగించిన భాస్కర శ్రేణిలో ఇది రెండవ ఉపగ్రహం. గణిత శాస్త్రవేత్త మొదటి భాస్కరుడు గుర్తుగా దీనికి ఆ పేరు పెట్టారు. దీనికి ముందు 1979లో భాస్కర-I ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగించింది.
News November 20, 2024
నేడు వేములవాడకు సీఎం రేవంత్
TG: సీఎం రేవంత్ ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడకు వెళ్లనున్నారు. ఉ.10:10 నుంచి ఉ.11.45 గంటల మధ్యలో వేములవాడ రాజన్నను దర్శించుకుంటారు. అనంతరం ఆలయ అభివృద్ధి పనులు, మిడ్ మానేరు నిర్వాసితుల కోసం నిర్మించనున్న ఇందిరమ్మ ఇళ్లతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. మ.1.45 తర్వాత HYDకు తిరుగు ప్రయాణమవుతారు.
News November 20, 2024
విడాకులపై ఏఆర్.రెహమాన్ ట్వీట్.. ఏమన్నారంటే?
భార్యతో విడాకులు తీసుకోవడంపై ఏఆర్.రెహమాన్ ట్వీట్ చేశారు. ‘మేము మా బంధంలో ముప్పై ఏళ్లు పూర్తి చేసుకోవాలనుకున్నాం. కానీ ఊహించని విధంగా ఇది ముగిసింది. విరిగిన హృదయాల బరువుకు దేవుని సింహాసనం కూడా వణుకుతుంది. విడిపోవడంలోనూ మేము అర్థాన్ని వెతుకుతాము. అయినప్పటికీ పగిలిన ముక్కలు మళ్లీ ఒక్కటి కాలేకపోవచ్చు. ఈ సమయంలో మా గోప్యతను గౌరవించినందుకు అందరికీ ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు.