News December 23, 2025
వరంగల్: గ్రామ సారథులకు సమస్యల స్వాగతం!

ఏడాదిన్నర కాలంగా క్షేత్ర స్థాయి పరిపాలన లేక బోసిపోయిన పల్లెల్లో కొత్త పాలకవర్గాలు కొలువు దీరాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1,682 గ్రామాల్లో సర్పంచులు బాధ్యతలు చేపట్టారు. వారికి గ్రామాల్లో సమస్యల స్వాగతం పలుకుతున్నాయి. ఇన్నాళ్లు పంచాయతీ కార్యదర్శులు నెట్టుకొచ్చారు. ప్రధానంగా సైడ్ డ్రైనేజ్ లు, సీసీ రోడ్లు, వీధి దీపాలు, నల్లా నీటి సరఫరా వంటి సమస్యల పరిష్కారం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు.
Similar News
News January 1, 2026
ఖమ్మం: సదరం సేవలపై సెర్ప్ సీఈవో సమీక్ష

సదరం అమలు, ధ్రువీకరణ పత్రాల జారీపై సెర్ప్ (SERP) సీఈవో దివ్య దేవరాజన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో అడిషనల్ కలెక్టర్ శ్రీజ పాల్గొన్నారు. సీఈవో మాట్లాడుతూ.. అర్హులైన దివ్యాంగులకు సకాలంలో సదరం సర్టిఫికెట్లు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. క్యాంపుల నిర్వహణలో పారదర్శకత పాటించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను నిబంధనల ప్రకారం వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు.
News January 1, 2026
ఫలితాలను సమీక్షించుకోవడం ముఖ్యం

దేన్నైనా సాధించాలి అనుకొనే క్రమంలో కఠిన పరిస్థితులు ఎదురైతే చేస్తున్న పనిని మరోసారి సమీక్షించుకోవాలి. ఇప్పటివరకు ఎదురైన ఆటంకాలు ఏమిటి? ఇప్పటివరకు ఏ వ్యూహం బాగా పనిచేసింది? ఏది సరిగా పనిచేయలేదు? అన్నది పరిశీలించుకోవాలి. పట్టుదలను పెంచుకోవాలి. రోజువారీ జీవితంలో కొన్ని మార్పులు చేసుకోగలిగినా అనుకున్న లక్ష్యం వైపు వెళ్లేందుకు అవి సాయపడతాయంటున్నారు నిపుణులు.
News January 1, 2026
నారాయణపేట: పుష్పగుచ్ఛాలు వద్దు.. పుస్తకాలివ్వండి- కలెక్టర్

నూతన సంవత్సర వేడుకలలో ఆడంబరాలకు స్వస్తి పలికి, సేవా దృక్పథాన్ని చాటాలని జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్ కోరారు. జనవరి 1న తనను కలవడానికి వచ్చే వారు బొకేలు, శాలువాలకు బదులుగా పేద విద్యార్థుల కోసం నోట్ పుస్తకాలు, పెన్నులు, పెన్సిల్ దుప్పట్లు తీసుకురావాలని బుధవారం విజ్ఞప్తి చేశారు. ఈ వస్తువులను సేకరించి త్వరలోనే అర్హులైన పిల్లలకు అందజేస్తామని ఆయన తెలిపారు.


