News December 23, 2025

క్లుప్తంగా చెప్పాలంటే ఇదే రైతు జీవితం..

image

వర్షం కాన రాదు.. కరవు పోదు.. కష్టం తరగదు.. ప్రకృతి తీరు మారదు.. బ్యాంకు రుణం తీరదు.. కన్నీళ్ల తడి ఆరదు.. రేపటి మీద ఆశ చావదు.. క్లుప్తంగా చెప్పాలంటే అన్నదాత జీవితం ఇదే. చేతి నిండా అప్పులున్నా, పేదరికం పగబట్టినా, నిరాశ ఆవహిస్తున్నా, నిస్సహాయుడిగా మిగిలినా.. తాను నమ్ముకున్న భూమి ఏనాటికైనా తన కష్టం తీరుస్తుందన్న నమ్మకంతో బతికే ఆశాజీవి ‘రైతు’ మాత్రమే. అన్నదాతలకు ‘జాతీయ రైతు దినోత్స‌వ’ శుభాకాంక్షలు.

Similar News

News January 9, 2026

సంక్రాంతికి ఫ్రీ టోల్‌ లేనట్లే!

image

సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై టోల్‌ మినహాయింపు ఉండదని కేంద్రం స్పష్టం చేసింది. పండుగ రోజుల్లో ట్రాఫిక్ రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో జనవరి 9 నుంచి 18 వరకు టోల్‌ ఫ్రీగా ప్రకటించాలని TG మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, TDP ఎంపీ సానా సతీశ్ బాబు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కోరారు. అయితే ఈ హైవేపై ఉచిత టోల్‌కు అనుమతి ఇవ్వలేమని కేంద్రం తెలియజేసినట్లు సమాచారం.

News January 9, 2026

విమానాల తయారీలోకి అదానీ గ్రూప్

image

అదానీ గ్రూప్ విమానాల తయారీ రంగంలోకి అడుగు పెట్టనుంది. బ్రెజిల్‌కు చెందిన ఏరోస్పేస్ దిగ్గజం ఎంబ్రాయర్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. భారత్‌లో రీజనల్ ప్యాసింజర్ జెట్ విమానాల తయారీకి అవసరమైన ఫైనల్ అసెంబ్లీ లైన్ (FAL) ఏర్పాటు చేయనున్నారు. ఫిక్స్‌డ్‌ వింగ్‌ ప్యాసింజర్‌ విమానాల తయారీకి సంబంధించి దేశంలో ఇదే తొలి అసెంబ్లింగ్‌ యూనిట్‌ కానుంది. ఈ నెలాఖరున జరిగే ఏవియేషన్ షోలో పూర్తి వివరాలను వెల్లడించనున్నారు.

News January 9, 2026

PMV 480(అల్లూరి).. అధిక పోషకాల వరిగ రకం

image

‘వరిగ’ ఒక రకమైన చిరుధాన్యం. వీటిలో ఫైబర్, కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్, కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. వీటిని అన్నం, అట్లు, మురుకుల తయారీలో ఉపయోగిస్తారు. విజయనగరం వ్యవసాయ పరిశోధనా స్థానం రూపొందించిన PMV 480(అల్లూరి) రకం వరిగ వంగడాన్ని తాజాగా విడుదల చేశారు. దీని పంటకాలం 72-77 రోజులు. ఇది ఖరీఫ్‌కు అనుకూలం. హెక్టారుకు 2.27 టన్నుల దిగుబడి వస్తుంది. మిగిలిన వాటి కంటే ఈ రకంలో ప్రొటీన్ శాతం అధికం.