News December 23, 2025

ఇల్లందకుంట రామాలయంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అపర భద్రాద్రిగా పేరుగాంచిన ఇల్లందకుంట శ్రీ సీతారామాచంద్ర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఈనెల 30న ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారు వైకుంఠ ద్వారం నుంచి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. భక్తులు అధిక సంఖ్యలో ఈ ఉత్సవాల్లో పాల్గొనాలని ఆలయ కార్యదర్శి సుధాకర్, ఆలయ ఛైర్మన్ రామారావు కోరారు.

Similar News

News January 10, 2026

టెన్త్‌లో 100% ఫలితాలే లక్ష్యం: కలెక్టర్‌ తేజస్

image

పదో తరగతి వార్షిక పరీక్షల్లో సూర్యాపేట జిల్లాను అగ్రస్థానంలో నిలిపేలా ఎంఈఓలు కృషి చేయాలని కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల కోసం ప్రత్యేక తరగతులు, 2 ప్రీ ఫైనల్‌ పరీక్షలు నిర్వహించాలన్నారు. ప్రతి విద్యార్థికి అభ్యాసన దీపికాలతో పాటు ఎగ్జామ్ ప్యాడ్, పెన్నులు పంపిణీ చేయాలని విద్యాశాఖ అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు.

News January 10, 2026

చిన్నస్వామి స్టేడియంలో RCB మ్యాచ్‌లు లేనట్టే?

image

బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో 2026 IPL మ్యాచ్‌ల నిర్వహణపై క్లారిటీ రావడం లేదు. ఇక్కడ మ్యాచ్‌ల గురించి RCB ఇప్పటివరకు KSCAతో చర్చించలేదు. కోహ్లీతోపాటు ఇతర ప్లేయర్ల భద్రత దృష్ట్యా గత ఏడాది ఈ గ్రౌండ్‌లో జరగాల్సిన డొమెస్టిక్ మ్యాచ్‌లను రాయ్‌పూర్‌కు తరలించారు. 2025 ట్రోఫీ <<16602800>>సెలబ్రేషన్స్‌లో జరిగిన తొక్కిసలాటలో<<>> 11 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ స్టేడియంలో RCB మ్యాచ్‌లు ఆడే అవకాశం లేనట్టే.

News January 10, 2026

గోదావరిఖని: చైనా మాంజా అమ్మితే చర్యలు తప్పవు: సీపీ

image

చైనా మాంజా అమ్మితే చట్టపరంగా చర్యలు తప్పవని రామగుండం సీపీ అంబర్‌ కిషోర్‌ హెచ్చరించారు. రామగుండం కమిషనరేట్‌ పరిధిలో చైనా మాంజా అమ్మకాలపై విస్తృత తనిఖీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రత్యేక బృందాలతో మార్కెట్లు, దుకాణాలు, గోదాముల్లో విస్తృత తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. చైనా మాంజా తయారీ, అమ్మకం, నిల్వ, వినియోగం పూర్తిగా నిషేధమని స్పష్టం చేశారు.