News April 22, 2024
ASF: పురుగుమందు తాగి బలవన్మరణం

దహెగాం మండలం పెసరుంట గ్రామానికి చెందిన జుమిడె కిరణ్ (27) పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై కందూరి రాజు తెలిపారు. కిరణ్ కడుపునొప్పితో కొంత కాలంగా బాధపడుతున్నాడు. ఆసుపత్రుల్లో చికిత్స తీసుకున్నా నయం కాలేదు. ఈ క్రమంలో శనివారం ఉదయం సమీప వాగుకు వెళ్లి పురుగుమందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే కాగజ్ నగర్ ఆసుపత్రికి తరలించారు. ఆదివారం చికిత్స పొందుతూ మృతి చెందారు.
Similar News
News March 5, 2026
ADB: ఇంటర్ పరీక్షకు 473 మంది గైర్హాజరు

ఆదిలాబాద్ జిల్లాలో ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు గురువారం ప్రశాంతంగా జరిగాయి. మొత్తం 8123 మంది విద్యార్థులకు గాను 7650 మంది హాజరయ్యారని డీఐఈవో జాదవ్ గణేశ్ కుమార్ తెలిపారు. జనరల్ విభాగంలో 7104 విద్యార్థులకు గాను 348 మంది, ఒకేషనల్ విభాగంలో 1019.విద్యార్థులకు గాను 125 మంది కలిపి మొత్తం 473 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు.
News March 4, 2026
ADB కలెక్టర్ క్యాంపు ఆఫీసులో హోలీ వేడుకలు

ఆదిలాబాద్ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బుధవారం సాయంత్రం హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో కలెక్టర్ రాజర్షిషా అదనపు కలెక్టర్ రాజేశ్వర్ పాల్గొని ఒకరికొకరు రంగులు చల్లుకుంటూ, హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఎస్పీ కార్పొరేషన్ ఈడి మనోహర్, సంక్షేమ అధికారి మిల్కా, డిపిఓ రమేష్, డిఎంహెచ్ఓ నరేందర్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్, మున్సిపల్ కమిషనర్ రాజు, మెప్మా పిడి రాజు ఉన్నారు.
News March 4, 2026
‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల ప్రణాళికపై సమీక్ష

ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” 99రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. ఆదిలాబాద్ కలెక్టరేట్లో పీఓ యువరాజ్ మర్మాట్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్ లతో కలిసి ఆయన ఈ కార్యక్రమంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ ప్రణాళిక ముఖ్య ఉద్దేశమని తెలిపారు.


