News December 23, 2025
అల్లూరి: అనారోగ్యంతో విద్యార్థి మృతి

వై. రామవరం మండలం మునసలపాలెం గ్రామానికి చెందిన బి.సాయికుమార్ రెడ్డి (8) అనారోగ్యంతో బాధ పడుతూ మంగళవారం ఇంటివద్దే మృతి చెందాడని గ్రామస్థులు తెలిపారు. వెదురునగరం పాఠశాలలో 3వ తరగతి చదువుతూ ఓ హాస్టల్‌లో ఉంటున్నాడు. కొన్ని రోజులుగా జ్వరం, పచ్చకామెర్లుతో బాధ పడుతుండంతో ఇంటికి తీసుకొచ్చి వైద్యం అందజేస్తుండగా మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Similar News
News December 25, 2025
త్వరలో కొత్త మెయిల్ ఐడీలు! గూగుల్ కీలక నిర్ణయం

త్వరలో జీమెయిల్ యూజర్ ఐడీ మార్చుకునే ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తున్నట్టు గూగుల్ వెల్లడించింది. కొత్త యూజర్ ఐడీతోపాటు పాత ఐడీ యాక్టివ్‌గానే ఉంటుందని, ఇన్‌బాక్స్ ఒకటేనని తెలిపింది. పాత ఐడీ మళ్లీ పొందాలంటే 12నెలలు ఆగాల్సిందేనని చెప్పింది. జీమెయిల్ అకౌంట్‌తో లింకైన ఫేస్‌బుక్, ఇన్‌స్టా, వాట్సాప్, ఆధార్ యూజర్లు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించింది. ఈ ఫీచర్ దశలవారీగా అమలులోకి వస్తుందని తెలిపింది.
News December 25, 2025
కదిరి: ప్రమాదంలో వ్యక్తి స్పాట్‌డెడ్

కదిరి మున్సిపాలిటీ పరిధిలో కుటాగుళ్ల-పులివెందుల క్రాస్ వద్ద గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. కదిరి రూరల్ పరిధిలోని కాళసముద్రంకు చెందిన రాజును గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టి వెళ్లిపోయిందన్నారు. అధికంగా రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు వివరించారు. పోలీసులు విచారణ చేపట్టారు.
News December 25, 2025
కర్నూలు: 9025 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు: ఎస్పీ

రోడ్డు ప్రమాదాల నివారణకు కర్నూల్ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. జిల్లావ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరం చేసినట్లు పేర్కొన్నారు. 2025 జనవరి నుంచి డిసెంబర్ 20 వరకు 9,025 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశామన్నారు. మద్యం తాగి వాహనం నడిపిన వారికి జరిమానాతో పాటు ఒక నెల జైలు శిక్ష విధించినట్లు చెప్పారు.


