News December 23, 2025

APPLY NOW: NIT గోవాలో పోస్టులు

image

<>NIT <<>>గోవా 8 JRF, ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు JAN 5 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి B.Tech/B.E./M.Tech./M.E.ఉత్తీర్ణతతో పాటు NET/GATE స్కోరు సాధించి ఉండాలి. షార్ట్ లిస్టింగ్, రాతపరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు JRFకు రూ. 37వేలు, రీసెర్చ్ అసోసియేట్‌కు రూ.30వేలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.nitgoa.ac.in

Similar News

News January 13, 2026

భోగి పళ్లలో ఏమేం ఉండాలి?

image

భోగి పళ్ల మిశ్రమంలో ప్రధానంగా రేగుపళ్లు ఉండాలి. వీటితో పాటు చిన్న చెరుకు ముక్కలు, శనగలు, చిల్లర నాణాలు, బంతిపూల రేకులు కలపాలి. కొన్ని ప్రాంతాల్లో వీటికి అదనంగా బియ్యం, నల్ల నువ్వులు కలుపుతారు. రేగుపళ్లు సూర్య భగవానుడికి ప్రీతిపాత్రమైనవి. నాణాలు లక్ష్మీదేవికి సంకేతం. ఈ వస్తువులన్నీ కలిపి పిల్లల తలపై పోయడం వల్ల వారిలోని గ్రహ దోషాలు తొలగి ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం సిద్ధిస్తాయని సంప్రదాయం చెబుతోంది.

News January 13, 2026

మామిడి ఆకులపై బుడిపెల నివారణ ఎలా?

image

కొన్ని తోటల్లో మామిడి చెట్ల ఆకులపై బుడిపెలు కనిపిస్తూ ఉంటాయి. వీటి వల్ల ఆకులు ఎండి, రాలిపోతుంటాయి. మీడ్జ్ పురుగు ఆశించడం వల్ల ఆకులపై ఈ బొడిపెలు ఏర్పడతాయని నిపుణులు చెబుతున్నారు. వీటి నివారణకు 100 లీటర్ల నీటిలో అజాడిరక్టిన్ (3000 పి.పి.ఎం) 300ml + క్లోరిపైరిఫాస్ 250mlను కలిపి చెట్ల ఆకులు పూర్తిగా తడిచేలా పిచికారీ చేయాలి. స్థానిక వ్యవసాయ అధికారుల సూచనల మేరకు ఈ మందును పిచికారీ చేయడం మంచిది.

News January 13, 2026

సంక్రాంతి వేళ 12 ప్రత్యేక రైళ్లు.. రిజర్వేషన్ అక్కర్లేదు!

image

AP: సంక్రాంతి పండుగ నేపథ్యంలో రిజర్వేషన్‌తో సంబంధం లేకుండా విశాఖ-విజయవాడ మధ్య 12 జన్ సాధారణ్ ట్రైన్స్ నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రకటించింది. ఈ రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, యలమంచిలి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, గన్నవరం స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగించనున్నట్టు తెలిపింది. జనవరి 12,13,14,16,17,18 తేదీలలో ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది.