News December 23, 2025
హిందూ మహిళలతోనూ అలానే చేయగలరా?: జావేద్ అక్తర్

బిహార్ CM నితీశ్ కుమార్ మహిళా డాక్టర్ హిజాబ్ <<18574954>>లాగడం<<>> విమర్శలకు దారి తీసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై బాలీవుడ్ రచయిత జావేద్ అక్తర్ మండిపడ్డారు. ‘నితీశ్ చేసిన పని అసభ్యకరంగా ఉంది. ఇతరులను అగౌరవపరిచే హక్కు ఎవరికీ లేదు. కొన్ని ఏరియాల్లో హిందూ మహిళలు ముఖం కనిపించకుండా ఘూంఘట్ (దుపట్టా, చీరకొంగు) కప్పుకుంటారు. వాటినీ లాగుతారా?’ అని ప్రశ్నించారు.
Similar News
News January 12, 2026
చర్మాన్ని ఇలా హైడ్రేట్ చెయ్యండి..

కాలం ఏదైనా చర్మం ఆరోగ్యంగా, తాజాగా కనిపించడానికి తేమ కావాలి. వయసు పైబడటం, ఎండ వేడికి చర్మం పాడవడం వల్ల చర్మ కణాల్లో నీటిశాతం తగ్గిపోతుంది. కాబట్టి చర్మానికి హైడ్రేటర్లను అందించాలి. మాయిశ్చరైజర్లతో పోలిస్తే హైడ్రేటర్లు కణాల మధ్య నీటిని పట్టి ఉంచడంలో సాయపడతాయి. గ్లిజరిన్, హ్యాలురోనిక్ ఆసిడ్ వంటివి హైడ్రేటర్లు. వాటిని తప్పక వాడాలి. వీటితో పాటు వారానికి రెండుసార్లు స్క్రబింగ్ చేయడం అలవాటు చేసుకోవాలి.
News January 12, 2026
కోల్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

కోల్ ఇండియా లిమిటెడ్(<
News January 12, 2026
పనసలో కాయకుళ్లు తెగులు లక్షణాలు

పనసలో కాయకుళ్లు తెగులు ప్రధానంగా బూజు తెగులు వల్ల వస్తుంది. ఇది పూత, పిందె దశలో మొదలై కాయకు వ్యాపిస్తుంది. ఈ తెగులు ఆశించడం వల్ల తొలుత మగ పువ్వులు, పూత, పిందెలు కుళ్లిపోతాయి. తర్వాత ఎదిగే కాయలు నల్లగా మారి కుళ్లిపోతాయి. ముఖ్యంగా జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఈ తెగులు ఉద్ధృతి ఎక్కువగా కనిపిస్తుంది. దీన్ని సకాలంలో గుర్తించి నివారణ చర్యలు చేపట్టకుంటే దిగుబడి బాగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది.


