News December 23, 2025

ఫ్రీగా విద్య, వైద్యం మాత్రమే ఇవ్వాలి: వెంకయ్య నాయుడు

image

విద్య, వైద్యం తప్ప మిగతావన్నీ ఫ్రీగా ఇవ్వాల్సిన అవసరం లేదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. హైదరాబాద్ నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ కళాశాలలో మాజీ ప్రధాని వాజ్‌పేయి శతజయంతి వేడుకలకు హాజరైన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. “ఫ్రీ బస్సులు ఇవ్వమని ఎవరు అడిగారు. ఉచితాల పేరుతో ప్రజలను సోమరిపోతులను చేస్తున్నారు. వాటిని ఆపేసి.. కష్టపడేవారికి చేయూతనివ్వాలి” అని అన్నారు.

Similar News

News January 14, 2026

నేటి ముఖ్యాంశాలు

image

❃ తెలుగు ప్రజలకు ఇరు రాష్ట్రాల సీఎంల పండగ విషెస్
❃ AP:అదనపు ఛార్జీలు వసూలు చేస్తే బస్సులు సీజ్: మండిపల్లి
❃ వైద్య శాఖకు ₹567 కోట్ల కేంద్ర నిధులు: సత్యకుమార్
❃ TG: గ్రామపంచాయతీలకు రూ.277 కోట్లు విడుదల
❃ అటెన్షన్ డైవర్షన్ కోసమే కమిషన్‌లు, సిట్‌ల ఏర్పాటు: KTR
❃ ఓల్డ్ సిటీలో కరెంట్ బిల్లులు చెల్లించట్లేదు: ఎంపీ కొండా
❃ కవిత కాంగ్రెస్‌లో చేరడం లేదు: పీసీసీ చీఫ్
❃ కుక్క కాటు మరణాలకు భారీ పరిహారం: SC

News January 14, 2026

పాలిటెక్నిక్‌లో కొత్త కోర్సులు!

image

TG: విద్యార్థులకు ఉపాధి కల్పనే లక్ష్యంగా పాలిటెక్నిక్‌లో 2026-27 విద్యాసంవత్సరం నుంచి 9 కొత్త కోర్సులు రానున్నాయి. దీనికి అనుగుణంగా కొత్త సిలబస్ రానున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై AICTE అనుమతుల కోసం రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేన ఢిల్లీకి వెళ్లారు. వీటితో పాటు మొదటి సంవత్సరంలో సెమిస్టర్‌కు బదులుగా వార్షిక పరీక్ష విధానం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

News January 14, 2026

పాలిటెక్నిక్‌లో కొత్త కోర్సులు ఇవే..

image

1)సెమీకండక్టర్స్ టెక్నాలజీ,
2)సివిల్ ఇంజినీరింగ్ అండ్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ వాల్యుయేషన్
3)ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ అండ్ ఇంజినీరింగ్
4)ల్యాండ్ స్కేప్ డిజైన్, 5)బయోటెక్నాలజీ
6)కన్‌స్ట్రక్షన్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్
7)సివిల్ ఇంజినీరింగ్ అండ్ బిల్డింగ్ సర్వీసెస్
8)ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజినీరింగ్
9)అడ్వాన్స్డ్ మాన్యుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ