News April 22, 2024

నెల్లూరు: భారీగా మద్యం స్వాధీనం

image

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అక్రమంగా తరలిస్తున్న మద్యం సీసాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సైదాపురం పరిధిలో 22, వేదాయపాళెంలో 14, ఉదయగిరి, వింజమూరులో 12 చొప్పున, దుత్తలూరులో 7, చేజర్లలో 10, కలువాయి, టీపీ గూడూరులో 15 చొప్పున, కండలేరులో 20, ఏఎస్ పేటలో 6 మద్యం సీసాలను పోలీసులు పట్టుకున్నారు. 420 బాటిళ్లను ఎస్ఈబీ అధికారులు సీజ్ చేశారు.

Similar News

News October 11, 2025

గంజాయి, మద్యంతో విచక్షణ కోల్పోతున్న యువత

image

జంట హత్యలతో నెల్లూరు నగరం ఉలిక్కిపడింది. మత్తులో విచక్షణ కోల్పోయిన నిందితులు కత్తులతో దాడులు, దోపిడీలు చేస్తున్నారు. రాము మద్యం డబ్బుల కోసం స్నేహితుడిపై కత్తితో దాడి చేయగా, మరో ఘటనలో డబ్బులివ్వలేదని చెప్పినవారిపై దాడి జరిగింది. నగరంలో గంజాయి, మద్యం విక్రయాలు విస్తరిస్తుండటంతో నేరాలు పెరుగుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. పాతనేరస్తులు రోడ్లపై కాపు కాస్తూ దోపిడీలకు పాల్పడుతున్నారని వాపోతున్నారు.

News October 11, 2025

నెల్లూరులో రోజురోజుకు పెరుగుతున్న నేరాలు

image

నెల్లూరులో ఇటీవల నేరాలు పెరుగుతుండడంతో ప్రజల్లో భయం నెలకొంది. కత్తులతో బెదిరించి దోపిడీలు, హత్యలు చేయడం పెరిగాయి. పెన్నా బ్యారేజ్ వద్ద జరిగిన జంట హత్యలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. యువకులు గంజాయి మత్తులో కత్తులు దాచుకొని ప్రజలను బెదిరిస్తున్నారు. చిన్న గొడవలకు కూడా కత్తులు చూపడం ఫ్యాషన్‌గా మారింది. పోలీసు నిఘా సరిగా లేక, పాత నేరస్థులపై చర్యలు లేవన్న ఆరోపణలున్నాయి.

News October 11, 2025

నెల్లూరు జిల్లాలో 30% మంది ఉబకాయం

image

ప్రస్తుత కాలంలో ఊబకాయం (Obesity) ప్రమాదకరంగా మారింది. గుండె, మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధులకు ఇది ప్రధాన కారణమవుతోంది. ఆహార అలవాట్లు, వ్యాయామం లేకపోవడం, జంక్ ఫుడ్స్ అధికంగా తినడం వల్ల పెద్దలతో పాటు చిన్నారులు కూడా ఊబకాయంతో బాధపడుతున్నారు. నెల్లూరు జిల్లాలో 30% మంది ఊబకాయులు ఉండగా, వారిలో సగం మహిళలేనని అధ్యయనం తెలిపింది. పిల్లల్లో 25% మందికి ఈసమస్య ఉంది. రోజు వ్యాయామం చేయాలని నిపుణులు అంటున్నారు.