News December 23, 2025
విజయవాడ: మందుల కోసం బారులు.. నేతలకు కానరాని సమస్య!

విజయవాడ కొత్త ప్రభుత్వాస్పత్రి సూపర్ స్పెషాలిటీ బ్లాక్‌లో మందులు కోసం ప్రజలు బారులుతీరారు. ఒకే కౌంటర్ ఉండటంతో మందులు కోసం 2 గంటలు లైన్లో నిల్చోవాల్సి వస్తోంది. అత్యవసరంగా మందులు అవసరమైనా అందని పరిస్థితి. అయితే ఇవాళ ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్, ఎంపీ చిన్ని, ఎమ్మెల్యేలు ఆసుపత్రిలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇలాంటి సమస్యలు వారి దృష్టిలోకి రాకపోవడం, కనిపించకపోవడం గమనార్హం.
Similar News
News January 15, 2026
విమానాలు రద్దు.. మరికొన్ని దారి మళ్లింపు

నిరసనల కారణంగా ఇరాన్ <<18861323>>గగనతలాన్ని<<>> మూసివేసిన విషయం తెలిసిందే. దీంతో ఎయిరిండియా, ఇండిగో సహా భారతీయ విమానయాన సంస్థలు ప్రయాణికులకు అడ్వైజరీలు జారీ చేశాయి. కొన్ని అంతర్జాతీయ విమానాలను దారిమళ్లిస్తున్నట్లు, మరికొన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ప్రతిఒక్కరూ మార్పులు, అప్డేట్ల కోసం తమ అధికారిక వెబ్‌సైట్‌లను పరిశీలించాలని కోరాయి. మరోవైపు ఇప్పటికే కేంద్రం ఇరాన్‌లోని భారతీయులను అప్రమత్తం చేసింది.
News January 15, 2026
కనుమ నాడు గోవులకు పూజ ఎందుకు చేస్తారు?

కనుమ అంటేనే పశువుల పండుగ. అవి ఏడాదంతా పొలం పనుల్లో రైతుకు చేదోడువాదోడుగా ఉంటాయి. పంట చేతికి రావడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అందుకు కృతజ్ఞతగా నేడు వాటిని పూజిస్తాం. శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి గోవులను, గోపాలురను రక్షించిన సందర్భాన్ని పురస్కరించుకుని ఈ గోపూజ సంప్రదాయం మొదలైంది. ఆవును జంతువుగా మాత్రమే కాకుండా ప్రకృతికి, జీవనాధారానికి ప్రతీకగా భావిస్తారు. ఆవును గౌరవించడం మన సంస్కృతిలో భాగం.
News January 15, 2026
అరటి సాగు – ఈ జాగ్రత్తలు తీసుకోండి

అరటి మొక్కలను నాటిన 6-8 నెలల్లో చెట్టు మొదలుకు మట్టిని ఎగదోస్తే చెట్టుకు బలం పెరుగుతుంది. గాలులు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో వెదురు గడలు పాతి అరటి చెట్టుకు ఊతం ఇవ్వాలి. గెలలు నరికిన చెట్లను అడుగువరకు నరికేయాలి. గెల వేసి హస్తాలు పూర్తిగా విచ్చుకున్న తర్వాత మగ పువ్వును కోసేయాలి. మగ పువ్వును కోసిన వెంటనే పాలిథీన్ సంచులను గెలలకు తొడిగితే పండ్లు పూర్తిగా ఏ విధమైన మచ్చలు లేకుండా ఆకర్షణీయంగా తయారవుతాయి.


