News December 23, 2025

పల్నాడులో ముమ్మరంగా వరి కోతలు

image

పల్నాడు జిల్లాలో సాగర్ కుడి కాలువ ఆయకట్టు పరిధిలో సాగుచేస్తున్న వరి పంట కోతకు రావటంతో రైతులు వరి కోత యంత్రాలను ఆశ్రయిస్తున్నారు. వరి కోతకు పంట నూర్పిడికి ఎకరాకు రూ.10 వేలు ఖర్చు అవుతుండగా కూలీలు దొరకడం లేదు. చేసేది లేక రైతులు గంటకు రూ. 2 నుంచి రూ.2,500 వరకు వెచ్చించి యంత్రాల సహాయంతో వరి కోతలు కోయిస్తున్నారు. యంత్రాల సహాయంతో సమయం కూడా అదా అవుతోందని రైతులు అంటున్నారు.

Similar News

News December 25, 2025

బంగ్లాకు తారిఖ్ రీఎంట్రీ: భారత్‌కు కలిసొచ్చేనా?

image

17 ఏళ్ల తర్వాత బంగ్లా డార్క్ ప్రిన్స్ తారిఖ్ రెహమాన్ స్వదేశానికి రానుండడాన్ని పెను మార్పుగా దౌత్యవేత్తలు అభివర్ణిస్తున్నారు. భారత్‌కు సానుకూల అంశంగా విశ్లేషిస్తున్నారు. బంగ్లాలో రెచ్చిపోతున్న మత ఛాందసవాదులు, జమాత్ ఏ ఇస్లామీ లాంటి యాంటీ ఇండియా, పాకిస్థాన్ అనుకూల శక్తులకు చెక్ పెట్టడానికి తారిఖ్ నాయకత్వంలోని BNP కీలకం కానుంది. అక్కడ సుస్థిర ప్రభుత్వం ఏర్పడితే భారత్‌తో సంబంధాలు మెరుగుపడతాయి.

News December 25, 2025

ముక్కోటి ఏకాదశికి సింహాచలం వెళ్తున్నారా?

image

సింహాచలంలో డిసెంబర్ 30న జరగనున్న ముక్కోటి ఏకాదశి దర్శనం టికెట్లు ఆన్లైన్‌లో అందుబాటులో తీసుకురానున్నారు. 100, 300, 500 రూపాయలు టికెట్స్ డిసెంబర్ 26 నుంచి 29 వరకు అందుబాటులో ఉంచుతారు. దర్శనానికి టికెట్లు ఆన్లైన్లో మాత్రమే ఇస్తున్నారు. www.aptemples.org, 9552300009 మన మిత్ర వాట్సాప్ నెంబర్ ద్వారా టికెట్స్ బుక్ చేసుకోవచ్చ. ముక్కోటి ఏకాదశికి సింహాచలం వెళ్లే ఈ విషయాన్ని భక్తులు గమనించాలి.

News December 25, 2025

మెదక్: పేదల దేవుళ్లకు 6దశాబ్దాలుగా పూజలు

image

కమ్యూనిస్టు ఉద్యమంలో చురుగ్గా పాల్గొని అకాల మరణం పొందిన కామ్రెడ్ కేవల్ కిషన్, లక్ష్మయ్యలు పేదల దేవుళ్లయ్యారు. పీడితుల విముక్తి నుంచి పోరాడి కూరుకుపోయిన భూస్వామ్యాన్ని కూల్చి సమాజ సమానత్వానికై పోరాడారు. కేవల్ కిషన్, ఆయన మిత్రుడు లక్ష్మయ్య ప్రమాదంలో మరణించి ఆరు దశాబ్దాలు గడిచింది. చేగుంట మండలం పొలంపల్లిలో గుడి కట్టి ఆరాధిస్తున్నారు. వారి వర్దంతి సందర్బంగా రేపు జాతర జరగనుంది.