News December 23, 2025
ప్రమాదంలో మృతి చెందిన యువకుడు ఇతనే..!

కర్లపాలెం మండలం పేరలి మంచినీళ్ల చెరువు సమీపంలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు మృతి చెందిన విషయం తెలిసిందే. యువకుడు చీరాల మండలం పేరాలకు చెందిన నానిగా గుర్తించారు. నాని పాతపాలెంలో ఉన్న తన సోదరిని పరామర్శించి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మంచినీళ్ల చెరువు వద్దకు చేరుకోగానే బైక్ అదుపుతప్పి రహదారి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టడంతో మృతి చెందాడు.
Similar News
News January 13, 2026
మెదక్ జిల్లాలో 27 మందికి ల్యాబ్ టెక్నీషియన్ పోస్టింగ్‌లు

మెదక్ జిల్లాలో 27 మందికి ల్యాబ్ టెక్నీషియన్‌గా పోస్టింగ్‌లు ఇచ్చారు. ఈరోజు హైదరాబాద్ ఉస్మానియా మెడికల్ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో మంత్రి దామోదర రాజానర్సింహా, ఇన్‌ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ చేతులు మీదుగా అభ్యర్థులు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా అభ్యర్థులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
News January 13, 2026
లక్ష్యానికి దూరంగా సూక్ష్మ సేద్యం..!

సూక్ష్మ సేద్య పథకం కింద అందాల్సిన డ్రిప్, స్ప్రింక్లర్ల యూనిట్లు రైతుల దరిచేరడంలో నీరుగారుతున్నాయి. నెల్లూరు జిల్లాకు 6 వేల హెక్టర్లకు రాయితీపై మంజూరు చేయాల్సి ఉండగా.. 2314.82 హెక్టర్లకు 1767 మంది రైతులకు అందజేశారు. గతేడాది సైతం 5 వేల హెక్టర్లకు 4553 హెక్టార్లకు 3700 మందికి ఈ యూనిట్లను ఇచ్చారు. కాగా మరో 2 నెలల్లో ఆర్ధిక ఏడాది ముగుస్తున్నా.. లక్ష్యాలను సాధించకపోవడం APMIP శాఖ పనితీరు అద్దం పడుతోంది.
News January 13, 2026
ఆయుర్వేద ఫార్మసీ విచారణ ఏమైంది..?

టీటీడీ పరిధిలోని శ్రీనివాసమంగాపురం… నరసింగాపురం ఆయుర్వేద ఫార్మసీలో అనేక అక్రమాలు జరిగాయని బోర్డు సభ్యులు ఒక్కరు ఆరోపించారు. అక్కడ జరిగిన అవినీతి అక్రమాలపై విజిలెన్స్ విచారణ సైతం జరిగింది. ఆరోపణలు వచ్చి ఆరు నెలల ముగిసినా ఇప్పటివరకు ఆ నివేదిక ఏమైంది? అసలు నిజంగా అవినీతి జరిగిందా లేదా అనేది ప్రకటించలేదు. దీనిపై టీటీడీ స్పష్టత ఇవ్వాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.


