News April 22, 2024

కొత్తకోట: రోడ్డు ప్రమాదంలో ఫార్మసీ విద్యార్థి మృతి

image

రోడ్డు ప్రమాదంలో బీఫార్మసీ విద్యార్థి మృతి చెందాడు. కొత్తకోట మండలం కనిపెట్ట గ్రామానికి చెందిన భాస్కర్(23) వనపర్తి ప్రభుత్వ కళాశాలలో ఫార్మసీ చేస్తున్నాడు. ఆదివారం ఇంటి నుంచి కొత్తకోటకు బైక్‌పై వెళ్తుండగా పాలెం సమీపంలో కారు ఢీకొట్టింది. భాస్కర్ తలకు తీవ్ర గాయం కాగా ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఈమేరకు తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదైందని SI మంజునాథ్ రెడ్డి తెలిపారు.

Similar News

News March 13, 2026

మహబూబ్‌నగర్: ఫలించని జశ్వంత్ ప్రయత్నం

image

భూత్పూర్ మండలం వెల్కిచర్లలో గురువారం ఓ తల్లి పిల్లలతోకలిసి బావిలోదూకి ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనలో ప్రాణాలతో బయటపడిన ఆమె కుమారుడు జశ్వంత్( 8)వారిని కాపాడేందుకు చేసిన ప్రయత్నంపట్ల గ్రామస్థులు ప్రశంసిస్తున్నారు. బాలుడు బావిలోని ఎత్తు ప్రదేశంలో పడటంతో ఒడ్డుకుచేరుకొని వెంటనే గ్రామంలోకి వెళ్లి గ్రామస్థులకు చెప్పడంతో గాలింపు చేపట్టారు. కానీ అప్పటికే తల్లి, కూతుళ్లు మృతి చెందారు.

News March 12, 2026

MBNR: ఈనెల 28న జాతీయ లోక్ అదాలత్ నిర్వహణ

image

మహబూబ్ నగర్ జిల్లా కోర్టులో ఈనెల 28వ తేదీన లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని జడ్జి ప్రేమలత తెలిపారు. రాజీ పడే ప్రతి కేసులను రాజు ద్వారానే పరిష్కారం చేసుకోవాలని రాజీ మార్గమే రాజమార్గం అని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 1334 కేసులను గుర్తించామని, అందులో 32 కేసులను పరిష్కారం చేశామని తెలిపారు. సివిల్, కుటుంబం, యాక్సిడెంట్, ఫ్రీ లిటిగేషన్ వంటి కేసులను పరిష్కారం చేసుకోవచ్చన్నారు.

News March 12, 2026

ఏడుకొండల కురుమూర్తి స్వామి దేవాలయానికి ముప్పు

image

పేదల తిరుపతిగా పేరుగాంచిన ఏడుకొండల కురుమూర్తి స్వామి దేవాలయానికి రానున్న కాలంలో ముప్పు తలపించే అవకాశం ఉందని దేవాలయ పరిరక్షణ కమిటీ సభ్యులు తెలిపారు. అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా తుతుమంత్రంగా నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపించారని అన్నారు. మొత్తానికి దేవాలయం పరిసర ప్రాంతాలలో క్రషర్ మిషన్ కంపెనీ ఏర్పాటు చేసి అక్కడ ఉండే ఏడుకొండలను తవ్వాలని ఆలోచన చేస్తున్నారని పేర్కొన్నారు.