News December 23, 2025

నంద్యాల: ‘హాయ్’ అని పెడితే FIR కాపీ

image

వాట్సాప్‌లో 95523 00009కు ‘హాయ్’ అని పెడితే FIR కాపీ పంపించేలా చర్యలు చేపట్టామని నంద్యాల ఎస్పీ సునీల్ షోరాన్ తెలిపారు. ప్రజలకు పారదర్శకంగా, వేగంగా సేవలందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం వాట్సాప్ గవర్నన్స్ తెచ్చిందన్నారు. పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసుకు సంబంధించి FIR కాపీ కోసం గతంలో బాధితులు వేచి ఉండాల్సి వచ్చేదన్నారు. ప్రభుత్వం ఇకపై వాట్సప్‌లోనే ఈ సౌకర్యం పొందే వెసులుబాటు కల్పించిందని వెల్లడించారు.

Similar News

News December 25, 2025

రాబోయే ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు: మంత్రి వాకిటి

image

కొడంగల్‌లో నూతన సర్పంచుల సన్మాన సభకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి వాకిటి శ్రీహరి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్ మద్దతుతో గెలిచిన సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో సంక్షేమ పథకాలు ప్రజలకు చేరాయని, పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిందని అన్నారు. రాబోయే ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు వస్తాయని తెలిపారు.

News December 25, 2025

మైలవరంలో ఓ విలాస భవనం.. దీని చరిత్ర మీకు తెలుసా..?

image

బ్రిటిష్ కాలం నాటి జమీందారీ వ్యవస్థకు గుర్తుగా మైలవరంలోని కోడిగుడ్డు మేడ. 1906లో ప్రారంభమై 1915లో పూర్తయిన ఈ భవనం, 3ఎకరాల స్థలంలో నిర్మించబడింది. సూరానేని వంశీయుల పాలనలో ఉన్న ఈ జమీందారీ వద్ద నుంచి 1970లలో మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు కుటుంబం దీనిని కొనుగోలు చేయగా, 1992లో లకిరెడ్డి హనిమిరెడ్డి, రూ.25,000కు కొనుగోలు చేసి, ఆధునికరించి 2 బురుజులు నిర్మించి నివాసానికి ఉపయోగిస్తున్నారు.

News December 25, 2025

ఉమ్మడి కృష్ణా జిల్లా కూటమి లీడర్లు విఫలం!

image

బెంజ్ సర్కిల్ నుంచి పెనమలూరు (ORR) వరకు ఫ్లైఓవర్, అండర్‌పాస్‌ల నిర్మాణాలను కాదని, కేవలం సర్వీసు రోడ్లకే NHAI మొగ్గుచూపడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎంపీ చిన్ని వెస్ట్ బైపాస్‌కు ఫ్లైఓవర్ మంజూరు చేయించుకోగా, కృష్ణా జిల్లా నేతలు పెనమలూరు వరకు ఫ్లై ఓవర్ సాధించడంలో విఫలమయ్యారనే విమర్శలొస్తున్నాయి. ప్రమాదాలు జరుగుతున్న కూడళ్ల వద్ద కనీసం అండర్‌పాసులైనా నిర్మించాలని ప్రయాణికులు కోరుతున్నారు.