News December 23, 2025

ఉత్తరాంధ్ర భూములపై TDP కన్ను: బొత్స

image

ఉత్తరాంధ్రపై TDP కన్ను పడిందని, విలువైన భూములను కొన్ని కంపెనీలకు అప్పనంగా ధారాదత్తం చేస్తోందని MLC బొత్స సత్యనారాయణ ఆరోపించారు. మంగళవారం విశాఖలో ఆయన మాట్లాడారు. ఎకరం రూ.50Cr-100Cr విలువైన భూములను తక్కువ ధరకు దోచిపెడుతోందని మండిపడ్డారు. భూ కేటాయింపుల్లో ఇన్‌సైడర్ వ్యవహారాలు జరుగుతున్నాయని దీనిపై కోర్టుకు వెళ్తామని హెచ్చరించారు. YCP అధికారంలోకి వచ్చాక విచారణ చేసి చర్యలు తీసుకుంటామన్నారు.

Similar News

News December 28, 2025

చిత్తూరు: DCCB ఛైర్మన్ పదవీకాలం పొడిగింపు

image

చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (DCCB) ఛైర్మన్ అమాస రాజశేఖర్ రెడ్డి పదవీ కాలాన్ని ఆరు నెలల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన పదవీకాలం ఈనెల 27తో ముగియగా మరో ఆరు నెలల పాటు పొడిగించింది. 2026 జూన్ 26వ తేదీ వరకు రాజశేఖర్ రెడ్డి DCCB నాన్ అఫీషియల్ పర్సన్ ఇన్‌ఛార్జ్‌గా కొనసాగనున్నారు.

News December 28, 2025

పిల్లల్లో డయాబెటీస్ ముప్పు తగ్గించాలంటే

image

డయాబెటిస్ సమస్య ఒకప్పుడు వృద్ధుల్లో కనిపించేది. ఇప్పుడు ఇది పిల్లలను కూడా ప్రభావితం చేస్తోంది. పిల్లల్లో ఈ సమస్య రాకుండా ఉండాలంటే కొన్నిజాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబంలో ఎవరికైనా డయాబెటిస్ ఉంటే, పిల్లలకు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించాలి. ఇంట్లో వండిన హెల్తీ ఫుడ్ పెట్టడం, ప్రతిరోజూ వ్యాయామం, స్వీట్లు, డ్రింక్స్ తగ్గించడం, ఫోన్, టీవీ స్క్రీన్ సమయాన్ని పరిమితం చేయడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి.

News December 28, 2025

సూర్య నమస్కారాలతో లాభాలివే..

image

పరమాత్మ స్వరూపమైన సూర్యుడికి సమర్పించే శక్తివంతమైన సాధనే సూర్య నమస్కారాలు. దీనివల్ల శరీరంలోని 12 చక్రాలు ఉత్తేజితమై, ప్రాణశక్తి ప్రవాహం మెరుగుపడుతుంది. సూర్య కిరణాల ప్రభావంతో మనసులో అశాంతి తొలగి, బుద్ధి ప్రకాశిస్తుంది. రోజూ నిష్టతో సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఆరోగ్యం, ఆయుష్షు, ఐశ్వర్యం సిద్ధిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇది ఆత్మవిశ్వాసాన్ని పెంచి, మనల్ని దైవత్వానికి దగ్గర చేస్తుంది.