News December 23, 2025

ఉత్తరాంధ్ర భూములపై TDP కన్ను: బొత్స

image

ఉత్తరాంధ్రపై TDP కన్ను పడిందని, విలువైన భూములను కొన్ని కంపెనీలకు అప్పనంగా ధారాదత్తం చేస్తున్నారని MLC బొత్స సత్యనారాయణ ఆరోపించారు. మంగళవారం విశాఖలో ఆయన మాట్లాడారు. ఎకరం రూ.50Cr-100Cr విలువైన భూములను తక్కువ ధరకు దోచిపెడుతున్నారని మండిపడ్డారు. భూ కేటాయింపుల్లో ఇన్‌సైడర్ వ్యవహారాలు జరుగుతున్నాయని దీనిపై కోర్టుకు వెళ్తామని హెచ్చరించారు. YCP అధికారంలోకి వచ్చాక విచారణ చేసి చర్యలు తీసుకుంటామన్నారు.

Similar News

News January 14, 2026

బ్లాక్‌చైన్ భద్రతలో భూ రిజిస్ట్రేషన్లు

image

TG: భూముల రిజిస్ట్రేషన్లలో అక్రమాలను నిరోధించేందుకు ప్రభుత్వం బ్లాక్‌చైన్ టెక్నాలజీ భద్రతను కల్పించనుంది. తొలుత ఫ్యూచర్ సిటీ భూముల కోసం ప్రత్యేక ‘హైడ్రా-లెడ్జర్’ వ్యవస్థను డిజైన్ చేసింది. దీంతో ఒక్కసారి ఎంట్రీ పడితే ఎవరూ మార్చలేరు. డబుల్ రిజిస్ట్రేషన్లు వంటివి లేకుండా కొనే వారికి, అమ్మేవారికి పూర్తి భరోసా ఇచ్చేలా ఈ ‘డిజిటల్ లాకర్’ వ్యవస్థను సిద్ధం చేస్తున్నట్లు అధికారులు ‘వే2న్యూస్’కు వివరించారు.

News January 14, 2026

CTR: భారీగా పడిపోయిన టమాటా ధరలు

image

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టమాటా ధరలు క్రమంగా పడిపోతున్నాయి. పుంగనూరులో మొదటి రకం 10 కిలోల బాక్స్ బుధవారం గరిష్ఠంగా రూ.194, కనిష్ఠంగా రూ.140 పలికింది. పలమనేరులో గరిష్ఠ ధర రూ.220, కనిష్ఠ ధర రూ.170, వి.కోటలో గరిష్ఠ ధర రూ.200, కనిష్ఠ ధర రూ.140, ములకలచెరువులో గరిష్ఠ ధర రూ.230, కనిష్ఠ ధర రూ.120గా నమోదైంది.

News January 14, 2026

‘గూడెం’ బరిలో రూ.2 కోట్లు పైమాటే?

image

తాడేపల్లిగూడెం(M)లో కోడిపందేల నిర్వహణ ఉత్కంఠ రేపుతోంది. గతేడాది ఒకే బరిలో రూ.కోటికిపైగా పందెం జరగగా, ఈసారి అది రూ.2కోట్లు దాటుతుందని సమాచారం. దీంతో పందెం రాయుళ్లంతా ఈ బరిపై ప్రత్యేక దృష్టి సారించారు. గురువారం భారీ స్థాయిలో బెట్టింగ్‌లు జరిగే అవకాశం ఉండటంతో ఉత్కంఠ నెలకొంది. మరోవైపు పోలీసులు బరులను ధ్వంసం చేస్తున్నా, లక్షలాది రూపాయల చేతులు మారే ఈ భారీ పందెంపైనే సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది.