News December 23, 2025
KCR ప్రెస్‌మీట్.. డిఫెన్స్‌లో రేవంత్ సర్కార్: హరీశ్ రావు

KCR ప్రెస్‌మీట్‌తో రేవంత్ సర్కార్ పూర్తి డిఫెన్స్‌లో పడిందని హరీశ్ రావు అన్నారు. ‘రాత్రి 9:30 గంటలకు CM చిట్‌చాట్, మంత్రులు పోటీపడి ప్రెస్‌మీట్లు పెట్టారంటే అదీ KCR పవర్. సర్పంచ్ ఎన్నికల ఫలితాలతో రేవంత్‌కు ఓటమి భయం మొదలైంది. అందుకే కో ఆపరేటివ్ ఎన్నికలు పెట్టట్లేదు. అవకాశమిస్తే అసెంబ్లీలో ప్రభుత్వ బండారాన్ని బయటపెడతాం. సాగునీటి ప్రాజెక్టుల పేరిట ఉత్తమ్, భట్టి ₹7,000Cr పంచుకున్నారు’ అని ఆరోపించారు.
Similar News
News December 26, 2025
$2టికెట్‌తో ₹16,153 కోట్లు గెలుచుకున్నాడు!

అమెరికాలోని పవర్‌బాల్ లాటరీలో ఓ వ్యక్తికి అదృష్టం వరించింది. క్రిస్మస్ ఈవ్ రోజున జరిగిన డ్రాలో ఏకంగా $1.8B (సుమారు రూ.16,153 కోట్లు) జాక్‌పాట్ తగిలింది. ఈ లాటరీలో ఒక సారి డబ్బులు ఎవరికీ దక్కకపోతే ఆ మొత్తం తరువాత టికెట్లకు యాడ్ అవుతుంది. దీంతో విన్నర్‌లకు అందే సొమ్ము భారీగా పెరుగుతుంది. గత 3 నెలలుగా ఎవరికీ దక్కని జాక్‌పాట్ ఓ వ్యక్తికి దక్కింది. కేవలం $2 టికెట్ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది.
News December 26, 2025
‘బాక్సింగ్ డే’ పేరెలా వచ్చిందంటే?

19వ శతాబ్దంలో బ్రిటన్‌లో పని మనుషులు క్రిస్మస్ రోజున కూడా పని చేసేవారు. దీంతో యజమానులు వారికి డిసెంబర్ 26న సెలవు ఇచ్చేవారు. క్రిస్మస్ వేడుకల్లో మిగిలిన పిండివంటలు, బహుమతులు, బట్టలు వంటివి చిన్న చిన్న బాక్సుల్లో పెట్టి అందించేవారు. అలా బాక్సుల్లో పెట్టి ఇవ్వడంతో బాక్సింగ్ డే అనే పేరు వచ్చింది. అలాగే చర్చిల ఎదుట బాక్సులు పెట్టి విరాళాలు సేకరించి డిసెంబర్ 26న పేదలకు పంచేవారు.
News December 26, 2025
కొత్త ఏడాదిలో ఇవి మారుతాయి!

కొత్త ఏడాదిలో పలు మార్పులు చోటుచేసుకోనున్నాయి.
*8వ వేతన సంఘం అమలుపై స్పష్టత రానుంది. ఉద్యోగుల జీతాలు పెరిగే ఛాన్స్.
*పలు బ్యాంకుల వడ్డీ రేట్ల తగ్గింపు, సవరించిన FD రేట్లు జనవరి నుంచి అమల్లోకి.
*బ్యాంకింగ్ సర్వీసులకు పాన్-ఆధార్ లింక్ తప్పనిసరి.
*PM కిసాన్ సాయం పొందేందుకు యూనిక్ ID కార్డ్ విధానం దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చే అవకాశం.
*LPG, వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరల్లో మార్పులు.


