News December 23, 2025

జ్యోతిబా ఫూలే విద్యాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

image

సిరిసిల్లలోని మహాత్మా జ్యోతిబా ఫూలే విద్యాలయంలో జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ గరీమా అగర్వాల్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. స్టోర్ రూమ్, వంటశాల నుంచి తరగతి గది వరకు ఆమె నిశితంగా పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహారాన్ని పరిశీలించి మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందజేయాలని ఆదేశించారు. విద్యార్థులతో మాట్లాడి ఆరో తరగతికి సంబంధించిన పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు.

Similar News

News January 16, 2026

ఆసిఫాబాద్: గురుకుల ప్రవేశ పరీక్ష ప్రకటన విడుదల

image

2026-27 విద్యా సంవత్సరానికి గాను రాష్ట్రంలోని వివిధ గురుకుల పాఠశాలల్లో (5, 6-9 తరగతులు) ప్రవేశాలకు ఉమ్మడి ప్రకటన విడుదలైంది. ఆసక్తి గల విద్యార్థులు డిసెంబర్ 11 నుంచి జనవరి 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు ఆధార్, బోనఫైడ్, కుల, ఆదాయ పత్రాలు అవసరం. ఈ అవకాశాన్ని కొమురం భీం జిల్లా విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.

News January 16, 2026

ముంబై పీఠం ఎవరిది.. నేడే కౌంటింగ్

image

ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌ (BMC) ఎన్నికల ఫలితాలు నేడు 10am నుంచి వెలువడనున్నాయి. మొత్తం 227 వార్డులకు జరిగిన ఎన్నికల్లో సుమారు 46-50% పోలింగ్ నమోదైనట్లు EC తెలిపింది. BJP నేతృత్వంలోని మహాయుతి కూటమి విజయం సాధిస్తుందని <<18867305>>ఎగ్జిట్ పోల్స్<<>> అంచనా వేశాయి. ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో కౌంటింగ్‌పై ఉత్కంఠ నెలకొంది. మేయర్ పీఠం కైవసం చేసుకోవడానికి 114 స్థానాల్లో విజయం సాధించాల్సి ఉంటుంది.

News January 16, 2026

కృష్ణా: బరుల వద్ద మద్యం ఏరులు.. గొడవలకు కారణం అదేనా.?

image

కోడిపందేల బరులు మద్యం విక్రయ కేంద్రాలుగా మారుతున్నాయి. బరుల వద్దే బెల్టు షాపులను తలపించేలా మద్యం అమ్మకాలు సాగిస్తున్నారు. ఒక్కో సీసాపై MRP కంటే రూ.100 అదనంగా వసూలు చేస్తూ నిర్వాహకులు సొమ్ము చేసుకుంటున్నారు. మద్యం మత్తులో పందెపు రాయుళ్లు, యువకులు చిన్నపాటి వివాదాలకే దాడులకు దిగుతున్నారు. తాడిగడప లాకుల సమీపంలో, పులిపాక వద్ద జరిగిన ఘర్షణల్లో యువకులు కత్తులతో దాడి చేసుకున్నట్లు సమాచారం.