News December 23, 2025

నంద్యాల-గుంతకల్లు మధ్య పగటి పూట రైలు

image

రైలు ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని గుంతకల్లు – నంద్యాల – మార్కాపురం మధ్య పగటి పూట రైలుకు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఎంపీ డా.బైరెడ్డి శబరి తెలిపారు. ఇటీవల పార్లమెంట్‌లో ఆమె చేసిన విన్నపానికి స్పందిస్తూ కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. త్వరలో పట్టాలెక్కనున్న ఈ రైలు సౌకర్యాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ రైలు (57407/08) త్వరలోనే పట్టాలెక్కనుంది.

Similar News

News December 27, 2025

విద్యుత్ ఉద్యోగుల బదిలీలపై సందిగ్ధత!

image

హనుమకొండ NPDCL పరిధిలో విద్యుత్ ఉద్యోగుల బదిలీలపై 15 రోజులుగా ఉత్కంఠ కొనసాగుతోంది. సీనియారిటీ జాబితా ఆధారంగా బదిలీలు జరుగుతాయన్న ప్రచారం మధ్య విద్యా సంవత్సరం మధ్యలో బదిలీలపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 27న టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం ఉద్యోగ సంఘాలు, అసోసియేషన్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది. బదిలీలు చేపట్టాలా? వద్దా? అన్నదానిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

News December 27, 2025

ఒకేరోజు రూ.20 వేలు పెరిగిన వెండి ధర

image

ఇవాళ కూడా వెండి ధర ఆకాశమే హద్దుగా పెరిగింది. నిన్న KG వెండి రూ.9 వేలు పెరగ్గా ఇవాళ ఒక్కరోజే ఏకంగా రూ.20వేలు పెరిగింది. దీంతో కిలో వెండి కాస్ట్ రూ.2,74,000కు చేరింది. 6 రోజుల్లోనే కిలో సిల్వర్ రేటు రూ.48వేలు పెరగడం గమనార్హం. మరోవైపు బంగారం ధర కూడా పెరుగుతూనే ఉంది. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర ఇవాళ రూ.1,200 పెరిగి రూ.1,41,220కి, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,100 పెరిగి రూ.1,29,450కి చేరింది.

News December 27, 2025

శ్రీకాకుళం: B.tech చదవి నకిలీ డాక్టర్ అవతారం

image

విశాఖ KGHలో డాక్టర్‌గా నమ్మించి కిడ్నీ బాధితుడి వద్ద లక్ష రూపాయలు వసూలు చేసిన <<18678274>>నిందితుడిని<<>> వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీకాకుళానికి చెందిన బాధితుడు తన కుమారుడి చికిత్స కోసం ప్రకటన ఇవ్వగా, నిందితుడు జ్యోతి శివశ్రీ ‘డాక్టర్ నరసింహం’గా పరిచయం చేసుకుని మోసగించాడు. బి.టెక్ చదివి కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న ఇతనిపై గతంలోనూ పలు దొంగతనాల కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.