News December 23, 2025
టెన్షన్ వద్దు.. ప్రతి గంటకు పరీక్షలు చేస్తాం: HMWSSB

ఇటీవల గండిపేట చెరువులో సెప్టిక్ ట్యాంక్‌తో వ్యర్థాలను వదులుతుండటంతో నగరం ఉలిక్కిపడింది. కాగా జలాశయం నుంచి నీటిని ఆసిఫ్‌నగర్, మీర్‌ఆలం వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లకు తరలించి శుద్ధి చేసిన అనంతరం HYDకు సరఫరా చేస్తామని HMWSSB తెలిపింది. నీటి నాణ్యతపై ఎలాంటి అనుమానాలకు తావులేకుండా ప్రతి గంటకు నీటి ప్రమాణాలను పరీక్షిస్తున్నట్లు స్పష్టం చేశారు. శుద్ధి ప్రక్రియలో అన్ని భద్రతా చర్యలు పాటిస్తున్నామన్నారు.
Similar News
News January 11, 2026
చిత్తూరు: అమ్మానాన్నపై ప్రేమతో..❤

చనిపోయిన తల్లిదండ్రుల పేరిట మాలధారణ చేసి ప్రేమను చాటుకున్నారు చిత్తూరుకు చెందిన SRB ప్రసాద్, ఈశ్వరీ దంపతులు. ‘మా అమ్మనాన్నకు 10మంది పిల్లలైనప్పటికీ కూలీ పనులు చేసి పెంచారు. వాళ్లు చనిపోయాక అమ్మనాన్న పడ్డ కష్టం, ప్రేమకు గుర్తుగా ‘అమ్మానాన్న దీవెన మాల’ స్వీకరించాం. మిగిలిన వాళ్లు ఇలా చేయాలని ఆశిస్తున్నాం’ అని ప్రసాద్ చెప్పారు. సంక్రాంతి రోజు తల్లిదండ్రుల ఫొటో వద్ద పూజలు చేసి మాల విరమించనున్నారు.
News January 11, 2026
సంక్రాంతి కోడి పందేలను అడ్డుకోవాలి: హైకోర్టు

AP: సంక్రాంతి సందర్భంగా నిర్వహించే కోడి పందేలను, పేకాటను అడ్డుకోవాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అవసరమైతే 144 సెక్షన్ అమలు చేయాలని తెలిపింది. జంతు హింస నిరోధక చట్టం-1960, జూద నిరోధక చట్టం-1974 అమలు చేయాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించింది. కోడి పందేలు, బెట్టింగ్‌లపై కోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేయడంతో ఈ మేరకు ఆదేశాలిచ్చింది. అన్ని మండలాల్లో తనిఖీ బృందాలను ఏర్పాటు చేయాలంది.
News January 11, 2026
కర్నూలు: ‘ఆయన వల్లే జగన్‌కు 11 సీట్లు’

కనీసం వార్డు మెంబర్‌గా గెలవని సజ్జల రామకృష్ణారెడ్డి చట్టసభలు, ప్రభుత్వ విధానాలపై మాట్లాడటం విడ్డూరమని MLC బీటీ నాయుడు ఎద్దేవా చేశారు. శనివారం కర్నూలులో మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో సజ్జల అనాలోచిత సలహాల వల్లే జగన్ 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయారని విమర్శించారు. సలహాదారుగా ఉండి ప్రజల సొమ్ము దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. ప్రస్తుతం సొంత పార్టీ నేతలే ఆయనను తిరస్కరిస్తున్నారని తెలిపారు.


