News December 23, 2025
యాదగిరిగుట్ట: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్

యాదగిరిగుట్ట మండలం దాతర్‌పల్లి, రాళ్ల జనగాం గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఈరోజు పరిశీలించారు. నిర్మాణ పనులు మొదలుపెట్టి ఎన్ని రోజులు అవుతుందని అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు పూర్తయిన వరకు బిల్లులు వచ్చాయా అని అడిగారు. మిగిలిన పనులు కూడా త్వరగా పూర్తి చేస్తే బిల్లు పడుతుందని, అనంతరం గృహప్రవేశం కూడా త్వరగా చేసుకోవాలని సూచించారు.
Similar News
News December 25, 2025
సిరిసిల్ల: ధాన్యం కొనుగోలు కమీషన్ చెక్కుల పంపిణీ

జిల్లాలో ఐకేపీ, మెప్మా, పీఏసీఎస్, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఖరీఫ్ 2023-24 సీజన్‌లో ధాన్యం కొనుగోలు చేయగా, ఇంకా 30 శాతం కమీషన్ రూ.1,90,73,487, అలాగే రబీ సీజన్లో 2023- 24లో 2,62,446 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. 100 శాతం కమీషన్ రూ.7,86,91,920 విలువైన చెక్కులను ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ పంపిణీ చేశారు.
News December 25, 2025
PHOTO GALLERY: క్రిస్మస్ సందడి

తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ సందడి నెలకొంది. రేపు క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ఆసియాలోనే అతిపెద్ద చర్చిల్లో ఒకటైన మెదక్ చర్చి విద్యుత్ దీపాలతో వెలిగిపోతోంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖ, వరంగల్ తదితర నగరాల్లో చర్చిలను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఇటు క్రైస్తవులు తమ ఇళ్లను కలర్‌ఫుల్ లైట్లతో డెకరేట్ చేశారు. క్రిస్మస్ గిఫ్ట్స్ కొనుగోళ్లతో మార్కెట్లూ సందడిగా మారాయి.
News December 25, 2025
TPUS జగిత్యాల జిల్లా అధ్యక్షుడిగా ప్రసాద్ రావు

జగిత్యాల TPUS జిల్లా అధ్యక్షుడిగా బోయినపల్లి ప్రసాద్ రావు, ప్రధాన కార్యదర్శిగా కొక్కుల రాజేశ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వీరికి రాష్ట్ర బాధ్యులు ఒడ్నాల రాజశేఖర్, గుడిసె పూర్ణచందర్, బోయినపల్లి చంద్రశేఖర్, గంప కిరణ్ కుమార్, బీర్పూర్ మండల శాఖ అధ్యక్షుడు చుక్క కిరణ్ కుమార్, మండల ప్రధాన కార్యదర్శి వడ్కాపురం సత్యవంశీ శుభాకాంక్షలు తెలిపారు.


