News April 22, 2024

ప.గో: నేడు నామినేషన్లు వేసేది వీరే

image

ఉమ్మడి ప.గో జిల్లాలో నేడు నామినేషన్లు వేసే అభ్యర్థులు వీరే.
☞ ఏలూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్.
☞ నరసాపురం BJP ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ.
☞ దెందులూరు- చింతమనేని ప్రభాకర్ (TDP).
☞ చింతలపూడి- సొంగా రోషన్ కుమార్ (TDP).
☞ ఉండి- రఘురామకృష్ణరాజు (TDP).
☞ నరసాపురం- బొమ్మిడి నాయకర్ (JSP).
☞ కైకలూరు- దూలం నాగేశ్వరరావు (YCP).

Similar News

News March 17, 2026

ఏలూరు రాజకీయాల్లో “పుట్టా“ రచ్చ

image

ప్రశాంతతకు మారుపేరుగా ఉన్న ఏలూరు రాజకీయాల్లో హైదరాబాద్ ఫాంహౌస్ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. డ్రగ్స్ తీసుకునే పార్టీలో ఎంపీ పట్టుబడటం అనేది రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎంపీ డ్రగ్స్ తీసుకున్నారని టెస్ట్‌లో పాజిటివ్ రావడాన్ని ఈగల్ టీమ్ SP ధృవీకరించారు. అయితే తాను ఏ తప్పు చేయలేదని నిర్దోషిగా బయటకొస్తానని MP అంటున్నారు. ఇటు టీడీపీ శ్రేణులు సైతం ఎంపీపై కుట్ర జరుగుతోందంటూ కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు.

News March 17, 2026

భీమవరం: ‘ఎండ తీవ్రతను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి’

image

రాబోయే వేసవిలో ఎండ తీవ్రతను ఎదుర్కొనేందుకు అధికారులు ముందస్తు చర్యలతో సిద్ధంగా ఉండాలి కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. ఈ మేరకు సంబంధిత అధికారులతో భీమవరం కలెక్టరేట్లో సమీక్ష సోమవారం సమావేశాన్ని నిర్వహించారు. ప్రజలు అధికంగా రాకపోకలు చేసే ముఖ్య కూడళ్లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఆసుపత్రులు, పాఠశాలలు వంటి ప్రదేశాలను గుర్తించి అక్కడ తాగునీటి సదుపాయం కల్పించాలని అధికారులను ఆదేశించారు.

News March 16, 2026

ప.గో: నేడు జిల్లా వ్యాప్తంగా ఎంతమంది పరీక్ష రాశారంటే..!

image

జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు మొదటి రోజు ప్రశాంతంగా జరిగాయని ప.గో డీఈఓ నారాయణ తెలిపారు. సోమవారం నిర్వహించిన తెలుగు పరీక్షకు 23,415 మంది విద్యార్థులు గాను 23,044 మంది విద్యార్థులు హాజరయ్యారని అన్నారు. 371 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని చెప్పారు. ఎటువంటి మాల్ ప్రాక్టీస్ జరగలేదని వెల్లడించారు.